కృష్ణ

చల్లని తల్లీ దండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 12: చల్లని తల్లీ, చక్కని తల్లీ, నీవే రక్షణ, నీవే అండ అంటూ వేలాది భవానీలు గ్రూపులుగా దుర్గమ్మను కీర్తిస్తూ గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షలను అత్యంత భక్తి ప్రపత్తులతో విరమించారు. అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజైన మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భవానీలు ఉదయం 6 గంటల నుండే అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఒంటి గంట తరువాత క్యూమార్గాల్లో భవానీలు స్వల్పంగా ఉండటంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది కొంత మేరకు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రాత్రి వివిధ రకాలైన మోటర్ వాహనాల మీద వచ్చిన భవానీలు కొంత సేపు విశ్రాంతి తీసుకుని, సీతమ్మవారి పాదాల చెంత ఉన్న పద్మావతి ఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, బస్‌లు, తదితర వాటి ద్వారా చేరుకున్న భవానీలు దుర్గాఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించారు. తర్వాత భవానీలు గురుభవానీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, వెంట వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 3కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేశారు. ఆ మార్గంలోని ప్రతి సెంటర్‌ల్లో వివిధ సేవా సంస్థలు, స్థానికులు భవానీలకు మంచినీరు, పాలు, పండ్లు, అల్పహారం, తదితర వాటిని ఉచితంగా అందించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం కెనాల్‌రోడ్‌లోని వినాయకుడి గుడి వద్ద క్యూమార్గంలోప్రవేశించి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోగా కొంతమంది భవానీలు, భక్తులు రూ. 100 టిక్కెట్‌తో ముఖమండప దర్శనం చేసుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. భవానీల రద్దీ కొంత తక్కువగా ఉన్నా పోలీసులు తొక్కిసలాటకు ఎలాంటి అవకాశం లేకుండా నియంత్రించి, క్యూమార్గంలోనే అనుమతించారు. దీంతో భవానీలు ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొనేందుకు అవకాశం కలిగింది. అనంతరం భవానీలు శ్రీ మల్లిఖార్జున మహామండపం సెంటర్‌లో రెండు చోట్ల ఏర్పాటు చేసిన హోమగుండాల వద్ద అక్కడ ఉన్న గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులు సమర్పించి, దీక్ష విరమణ చేశారు. అర్జునవీధిలోని దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉచిత నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. తర్వాత కనకదుర్గనగర్‌లో ఉన్న దేవస్థానం ప్రసాదాల కౌంటర్‌ల్లో అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేశారు. భవానీల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి భవానీకి సుమారు 20 లడ్డూలను కౌంటర్‌ల్లో ఆలయ సిబ్బంది విక్రయించారు. దీక్ష విరమణ చేసిన తర్వాత కొంతమంది భవానీలు అరండల్ సత్రం, నగరపాలక సంస్ధ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కేశ ఖండనశాలల్లో తలనీలాలు సమర్పించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. సోమవారం సాయంత్రం 5గంటల సమయానికి సుమారు 60వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది.