కృష్ణ

బీసీలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 14: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలపై సవతితల్లి ప్రేమ ను చూపుతున్నారని బీసీ సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షుడు శొంఠి నాగరాజు విమర్శించారు. గురువారం మండల ప రిధిలోని మేకావానిపాలెం పంచాయతీ పరిధిలోని నవీ న్ మిట్టల్ కాలనీలో బీసీల ఐక్యసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రజకులకు, మత్స్యకారులకు రెండెకరాలు, గౌడ సం ఘాలకు ఐదెకరాల భూమి ఇస్తానని, వీటితో పాటు 17 హామీలను సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చారన్నారు. కేవలం కాపులను బీసీలలో చేర్చడం ఒక్కటే చంద్రబాబుకు గుర్తుందని, దీనిని బట్టి బీసీల మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మండల మహిళా అధ్యక్షురాలు కాగిత విశాలాక్ష్మి మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన మైలవరంలో జరిగే బీసీ గర్జనకు బందరు మండలం నుండి పెద్ద ఎత్తున బీసీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం మేకావానిపాలెం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కందుల నాగ వెంకట కృష్ణ, చల్లపల్లి మండల అధ్యక్షుడు పఠాన్, పొలగాని సుబ్బారావు, వినయ్, గడ్డం రాజు, ఎస్‌కె అసియా తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారునికి జెసీబీ అందజేత
అవనిగడ్డ, డిసెంబర్ 14: కాపు కార్పొరేషన్ ద్వారా రుణం పొంది జెసీబీని కొనుగోలు చేసిన లబ్ధిదారుడు దాసినేని శ్రీనివాసరావుకు గురువారం ఉప సభాపతి బుద్ధప్రసాద్ చేతులు మీదుగా జెసీబీని అందించారు. స్థానిక శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ వాహనాన్ని అందించారు. మొత్తం రుణం రూ.26లక్షలు మంజూరు కాగా దానిలో రూ.20లక్షల వరకు సబ్సిడీ లభిస్తోంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తుమ్మల చౌదరిబాబు, కె వెంకటేశ్వరరావు, గాజుల మురళీకృష్ణ, యాసం శ్రీరాములు, మత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్‌కు ఎల్బీఆర్సీఇ విద్యార్థిని ఎంపిక

మైలవరం, డిసెంబర్ 14: జనవరి 26న రిపబ్లిక్‌డే వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలో జరిగే ఎన్‌సిసి విద్యార్థుల పరేడ్‌కు స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని పి కిరణ్మయి ఎంపికైనట్లు కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో కిరణ్మయిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకలలో పాల్గొనే అరుదైన అవకాశం తమ కళాశాల విద్యార్థిని లభించడం గర్వకారణంగా చెప్పారు. విజయవాడలోని 4వ ఆంధ్ర గరల్స్ ఎన్‌సీసీ బెటాలియన్ నుండి ఒకే ఒక్క విద్యార్థిని రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపిక కావడం, ఆ బాలిక తమ విద్యార్థిని కావటం అభినందనీయమన్నారు. ప్రిన్సిపాల్ కె అప్పారావు, తదితరులు కిరణ్మయిని అభినందించి సత్కరించారు.