కృష్ణ

భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 14: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 10న ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 5రోజుల పాటు కొనసాగి గురువారం ఉదయం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. సుమారు 5లక్షల మంది భవానీలు దీక్ష విరమణ చేసి దుర్గమ్మను దర్శించుకున్నారు. గురువారం వేకువజామున మంచు విపరీతంగా కురిసినప్పటికీ భవానీలు పెద్దసంఖ్యలో ఇంద్రకీలాద్రికి వచ్చి దీక్ష విరమించి దుర్గమ్మను దర్శించుకున్నారు. చివరిరోజు కావటంతో రాష్టవ్య్రాప్తంగా దీక్షాపరులు అధికంగా రావటంతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. గురువారం నాడు దుర్గమ్మ దర్శనానికి సుమారు 4గంటల సమయం పట్టింది. అధికారులు నిత్యం వేకువ జాము నుండి రాత్రి సుమారు 11గంటల వరకు భవానీలు, భక్తులు దుర్గమ్మను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న భవానీలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సీతమ్మవారి పాదాల చెంత ఉన్న పద్మావతి, దుర్గా ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేసి వాటిని శిరస్సుపై ధరించారు. తమ కుటుంబ సభ్యులు వెంటరాగా గురుభవానీల ఆధ్వర్యంలో సుమారు 3కిలోమీటర్లు గిరిప్రదక్షణ చేశారు. గిరి ప్రదక్షిణ సమయంలో భవానీలకు వివిధ సేవా సంస్థలు, పార్టీలకు చెందిన నేతలు, స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పండ్లు, పాలు, వాటర్ ప్యాకెట్‌లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు అందచేశారు. ప్రతి సెంటర్‌లో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేయటంతో భవానీలు దేవతామూర్తులను దర్శించుకున్నారు. గిరిప్రదక్షిణ పూర్తి చేసిన భవానీలు తిరిగి కెనాల్ రోడ్‌లోని వినాయకుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి ప్రవేశించి కొండపైకి చేరుకొని దుర్గమ్మను దర్శించుకున్నారు. భవానీల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో దుర్గమ్మను దర్శించుకునేలా పోలీసులు జాగ్రత్తలు పాటించారు. దర్శనానంతరం మెట్లమార్గం ద్వారా కిందికి చేరుకుని శ్రీ మల్లిఖార్జున మహా మండపం సెంటర్‌లో రెండుచోట్ల ఏర్పాటు చేసిన హోమగుండాల వద్ద ఇరుముడిలోని పూజాసామగ్రి వేయించి గురుభవానీల ఆధ్వర్యంలో మాలలు తీయించుకున్నారు. అర్జున వీధిలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. కనకదుర్గనగర్‌లోని ప్రసాదాల కౌంటర్లలో ప్రసాదాలు కొనుగోలు చేశారు. ప్రతి భవానీకి సుమారు 20 లడ్డూలను సిబ్బంది విక్రయించారు. దీక్ష విరమించిన భవానీలు అరండల్ సత్రం, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కేశఖండనశాలల్లో తలనీలాలు సమర్పించుకున్నారు.

ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీల ద్వారా
వరకట్న వేధింపుల కేసుల పరిష్కారం
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్

మచిలీపట్నం, డిసెంబర్ 14: ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీల ద్వారా వరకట్న వేధింపుల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా దర్యాప్తు అధికారులకు వరకట్న వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజీవ్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాలు ఆవశ్యమన్నారు. వరకట్న వేధింపుల కేసులో ఫిర్యాదీకి భర్తకు కౌనె్సలింగ్ ద్వారా వివాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కొన్ని సందర్భాల్లో 498(ఎ) ఐపీసీ సెక్షన్ దుర్వినియోగమవుతుందన్నారు. ఈ తరహా నేరాల విషయంలో గతంలో మాదిరి కేసు నమోదు, అరెస్టు ప్రక్రియను సడలించి, కేవలం వరకట్న వేధింపులు ఎదురైన సందర్భంలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, కేసు నమోదు చేయనవసరం ఉంటే సంబంధిత పోలీసు స్టేషన్‌కు నివేదించటం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఆరు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడలో రెండు, మచిలీపట్నంలో రెండు, నూజివీడులో ఒకటి, నందిగామలో ఒక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ హరిరాజేంద్ర బాబు, డీసీఆర్‌బీ ఎస్‌ఐ గఫార్ తదితరులు పాల్గొన్నారు.