కృష్ణ

నాగాయలంకలో పర్యాటకాభివృద్ధికి రూ.1.25 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, డిసెంబర్ 16: నాగాయలంకలోని శ్రీరామపాదక్షేత్రం వద్ద పుష్కరఘాట్ సమీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.కోటి 25లక్షలను మంజూరు చేసిందని ఆ శాఖ సూపరింటెండెంటు ఇంజనీర్ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా గుర్తించిన వివిధ పర్యాటక స్థలాల్లో నాగాయలంక కూడా ప్రముఖంగా ఉందన్నారు. ఈ విషయమై తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్, ఈ ప్రాంత శాసనసభ్యుడు, ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పర్యాటక అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలపై నివేదికలను తయారు చేశారని ఆయన తెలిపారు. త్వరలో కార్యక్రమాలను దశల వారీగా చేపట్టటం జరుగుతుందని వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సర్పంచ్ శీలి రాము, స్వచ్ఛ నాగాయలంక అధ్యక్షుడు గడ్డిపాటి సుధీర్‌బాబు, ఎంపీటీసీ సభ్యురాలు తలసిల స్వర్ణలత, ప్రధాన కార్యదర్శి బోయపాటి రాము, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యతనివ్వాలి
* ఎమ్మెల్యే కల్పన
కూచిపూడి, డిసెంబర్ 16: ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన కోరారు. ఈనెల 19 నుండి నిర్వహించే ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంపై శనివారం మొవ్వ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కిలారపు మంగమ్మ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన సర్వేలో 50 శాతం మంది మరుగుదొడ్లు ఉన్నా ఆరుబయట మల విసర్జన చేస్తున్నారని తెలిసిందన్నారు. ప్రతి గ్రామంలో బహిరంగ మల విసర్జన చేసే ప్రాంతాలలో షామియాన వేసి బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు అవకాశంలేని చోట్ల సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ సిహెచ్ సుబ్బారావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి ఆనందరావు, ఎంపీటీసీ కంభం రామలక్ష్మి, తహశీల్దార్ బి రామానాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ డా. యం శ్రీనివాసరావు, ఎంఇఓ తోట వెంకటేశ్వరరావు, ఐసీడీఎసీ సీడీపీఓ టి గాయత్రిదేవి, సీనియర్ అసిస్టెంట్ ఎ శ్రీనివాసరావు, డా. కట్టా వంశీమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారుల చేత ఎమ్మెల్యే కల్పన ప్రతిజ్ఞ చేయించారు.