కృష్ణ

పుట్రేలలో భార్యాభర్తల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్సన్నపేట, డిసెంబర్ 16: నిండు నూరేళ్ళు చేదోడువాదోడుగా ఉంటూ కాపురం చేయవల్సిన భర్తే భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని జీవితాన్ని దుర్భరం చేసుకుని చివరకు ఇద్దరూ విగతజీవులైన సంఘటన మండలంలోని పుట్రేల గ్రామపరిధిలో శుక్రవారం రాత్రి జరుగగా శనివారం ఉదయం వెలుగుచూసింది. భార్యాభర్తలైన కుప్పల మేరమ్మ (32), కుప్పల కృష్ణ (35)లు మృతి చెందడంతో గ్రామం మొత్తం ఉలిక్కిపడి విగతజీవులైన భార్యభర్తల మృతదేహాలు చూసి పలువురు కంటనీరు పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని వెంసూర్ మండలం వీరపల్లి గ్రామానికి చెందిన కుప్పల కృష్ణకు కృష్ణాజిల్లా ఎ కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన పైడిశాల మేరమ్మకు 17 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె రాజేశ్వరి ప్రస్తుతం పదవ తరగతి చదువుతుండగా చిన్న కుమార్తె పల్లవి 8వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ అమ్మమ్మ ఊరైన పోలిశెట్టిపాడులో చదువుకుంటున్నారు. ఇటీవల కొంతకాలంగా భార్య మేరమ్మపై అనుమానం పెంచుకున్న కృష్ణ తరచుగా వేధించడం ప్రారంభించాడు. చీటికిమాటీకి భార్యతో గొడవ పడుతుండటంతో భరించలేని మేరమ్మ తమ పెద్దలకు వివరించింది. ఇటీవల కొంతకాలం పాటు భార్యాభర్తలు విడిగానే ఉన్నారు. పెద్దల జోక్యంతో మంచిగా చూసుకుంటానని నమ్మబలికి కృష్ణ తన భార్యను కాపురానికి తీసుకొచ్చుకున్నాడు. పుట్రేల గ్రామానికి చెందిన ఒక రైతు కోళ్ళ ఫారంలో భార్య భర్తలు జీతానికి కుదిరారు. కోళ్ళ ఫారంలో పనిచేస్తున్నప్పటికీ కృష్ణ ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్యను అనుమానిస్తూ తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. శనివారం ఉదయం కోళ్ళఫారంలో కూలిపనికి వచ్చిన మహిళా కూలీలు ఉదయం 10 గంటలు అవుతున్నా భార్యాభర్తలు ఇద్దరూ కనిపించకపోవడంతో అదే కోళ్ళఫారంలో నివాసం ఉంటున్న వారి గది తలుపుతట్టారు. తలుపులు లోపల వైపు గడియ పెట్టడంతో ఎంతకీ తలుపులు రాకపోవడంతో కిటికిలోనుండి చూడగా భార్య భర్తలు ఇద్దరూ మంచంపై విగతజీవులై కనిపించారు. భయపడిన మహిళా కూలీలు తమ కోళ్ళఫారం యజమానికి విషయం తెలిపారు. సమాచారం తెలిసి ఎస్‌ఐ తులశీధర్ తమ సిబ్బందితో సంఘటన స్థలికి వెళ్ళి ఆయనే స్వయంగా తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో సగం తినగా మిగిలిన ఆహారాన్ని సేకరించి శవ పంచనామ నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.