కృష్ణ

మత్స్యకారుల సంక్షేమానికి నూతన విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 28: మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్య పరిశ్రమ వృద్ధికి దోహదం చేసేలా జాతీయ సముద్ర మత్స్య విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. జాతీయ సముద్ర మత్స్య విధానం- 2016 ముసాయిదాపై చర్చా కార్యక్రమాన్ని గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రానున్న పదేళ్లకు జాతీయ స్థాయి మత్స్య ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. గత ఏడాది మత్స్య రంగంలో 36శాతం వృద్ధి నమోదు అయినప్పటికీ మన సముద్ర జలాల్లో అనుకున్నంతగా ఉత్పత్తి జరగలేదన్నారు. మత్స్య సంపద ఉత్పత్తి పెంపునకు ఏమిచేయాలనే దానిపై సమగ్రంగా చర్చించాలని, సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులను కోరారు. నిర్దిష్టమైన ప్రణాళిక, పర్యవేక్షణ కొరవడటంతో మత్స్య వనరులు తగ్గుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థిరమైన దిగుబడి సాధనకు సముద్రపు లోతుల్లో వేట కొనసాగించడానికి శాటిలైట్, నెట్టింగ్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలు అవలంబించటంతో పాటు ఫిషింగ్ ప్రాదేశిక జలాల ప్రాంతాలను విస్తరింప చేయాలన్నారు. 2002వ సంవత్సరం తర్వాత రిజిష్టరైన బోట్లకు ఆయిల్ సబ్సిడీ లేకపోవడం బాధాకరమన్నారు. చేపల వేట నిషేధ కాలంలో గత ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేదని, తమ పార్టీ అధికారంలోకి రాగానే రూ.4వేలు జీవనభృతి కల్పిస్తున్నట్లు మంత్రి రవీంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, మత్స్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ సాల్మన్‌రాజు, కాకినాడ మత్స్య శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఎడిలు లాల్ అహ్మద్, సురేష్, జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.