కృష్ణ

అందరికీ లబ్ధి కలిగేలా జన్మభూమి కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, జనవరి 2: గ్రామాలలోనే సమావేశాల ద్వారా గ్రామాలు ఆదర్శవంతంగా తయారు అవుతాయని అందుకే ప్రతి గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జలవనరులమంత్రి దేవినేని ఉమా అన్నారు. మంగళవారం 5వ విడత జన్మభూమి కార్యక్రమం మండలంలోని గుడిమెట్ల, బొబ్బిళ్లపాడు గ్రామాలలో నిర్వహిచారు. గుడిమెట్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి ఉమా, ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరిందని అలాగే సంక్షేమ పధకాలలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఉమా మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా ఫింఛన్‌లు ఎవరికి వచ్చింది అన్నది లిస్టులో చూసుకొని పేరు రాకపోతే అర్హత ఉన్న వారు 10వ తేదీలోపు అర్జీ పెట్టుకోవాలని సూచించారు. అలాగే గృహనిర్మాణాలు మంజూరు అయిన లబ్ధిదారులు వెంటనే నిర్మించుకొనేలా చూడాలని వారికి ఇసుక తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని, అలాగే స్థానిక నాయకులు ఇటుక బట్టీల వారితో కూడా మాట్లాడి తక్కువ ధరకి ఇచ్చేలా చూడాలని సూచించారు. సంక్షేమ పథకాలు పొందే క్రమంలో ఎవరికి లంచం ఇవ్వవద్దని సూచించారు. పంచాయితీ పరిధిలో పట్టాలులేకుండా నివాసం ఉంటున్న వారిని గుర్తించి పట్టాలు మంజూరు చేయటానికి జిఒనెం 388 ఇవ్వటం జరిగిందన్నారు. గతంలో పక్కాగృహం నిర్మించుకోవాలంటే స్థలం సమస్య ఉండేదని, ఇప్పుడు సమస్య లేకుండా 750 అడుగులలో నిర్మాణం చేసుకోనేలా వీలు కల్పించటం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పధకాలు అమలు చేయటానికి వీలుగా సాధికార మిత్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని వీరు ప్రతి 35 కుటుంబాలకు ఒకరు ఉంటారని వీరి ద్వారా ప్రభుత్వ ఫధకాలు వారికి నేరుగా అమలు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, ఎఎంసి చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వాసిరెడ్డి ప్రసాద్, ఆర్డీవో హరీష్, నోడల్ అధికారి రామారావు, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ విజయ్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, ఎంపిపి కస్తాల రవిబాబు తదితరులు పాల్గొన్నారు.