కృష్ణ

జన్మభూమిలో నేతల వాగ్వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జనవరి 2:జన్మభూమి-మా ఊరు కార్యక్రమం తొలి రోజు డివిజన్ ప్రధాన కేంద్రమైన నూజివీడులో రసాభాసగా మారింది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూజివీడు పురపాల సంఘం పరిధిలోని విక్టోరియా పురమందిరంలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరిస్తుండగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జోక్యం చేసుకుని ఏదేదో చేసేస్తున్నాం అని గొప్పలు చెప్పటం కాదు. వాస్తవాలు మాట్లాడండి. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయండి అన్నారు. ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ జరుగలేదని. పేదలకు ఇచ్చిన పట్టాలకు నివేశన స్ధలాలు చూపించటం లేదని నిలదీశారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు కంగుతిన్నారు. రుణమాఫీ ఏ మహిళా సంఘానికి జరుగలేదో చెప్పండి అంటూ టీడీపీ నాయకులు ఎదురు ప్రశ్నించారు. ఈతరుణంలో వైకాపా నాయకులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున లేచి తమకు రుణమాఫీ జరుగలేదని, దానికి సంబంధించిన పత్రాలను అధికారులకు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు అందజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. పరిస్థితి శృతి చెందుతుందని భావించిన జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఉన్నాయని, అక్కడకు వెళదాం రండి అంటూ ఆహ్వానించారు. మీరే వెళ్ళండి, మీరే చేసుకోండి, ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా మీకు లేదంటూ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు జన్మభూమి కార్యక్రమం నుండి వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమంగా జన్మభూమి ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ శారదాదేవి, రెవిన్యూ డివిజనల్ అధికారి చెరుకూరి రంగయ్య, పురపాలక సంఘం కమిషనర్ మల్లికార్జునరావు, పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ బసవ రేవతి, మాజీ ఛైర్మన్ బసవ బాస్కరరావు, మాజీ శాసనసభ్యులు, నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు చెరుకూరి దుర్గప్రసాద్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.