కృష్ణ

అభివృద్ధిని గమనించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 2: గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజా సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించి జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఐదవ విడత జన్మభూమి గ్రామసభలను జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. పురపాలక సంఘ పరిధిలోని 1వ వార్డు, మండల పరిధిలోని పెదపట్నం, కానూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలకు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభల్లో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి గ్రామసభలు వేదికగా నిలుస్తాయన్నారు. గత నాలుగు విడతల్లో ప్రజల నుండి వచ్చిన అర్జీలన్నింటినీ దాదాపు పరిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఇందు కోసం 6వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. బందరు నియోజకవర్గంలో 21వేల 626 మందికి పెన్షన్లు, 68వేల మందికి రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా బియ్యం అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామన్నారు. మురుగునీటి పారుదలను మెరుగుపర్చేందుకు గాను రూ. 68 కోట్లతో ముంపు నివారణ చర్యలు చేపట్టామన్నారు. మంగినపూడి బీచ్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరణ పనులు చేపట్టామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1560 కోట్లతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు నిరంతర విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి అవకాశ కల్పనకు రుణాలు, పథకాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారుల అభివృద్ధి, సెంటర్ లైటింగ్, డివైడర్ల గ్రీనరీ అభివృద్ధి, ఎల్‌ఇడీ లైట్లు ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాల్లో బందరు డివిజన్ జన్మభూమి పరిశీలన అధికారిగా నియమితులైన ఐఎఎస్ అధికారి సిహెచ్ శ్రీ్ధర్, టీడీపీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, గొర్రిపాటి గోపీచంద్, బూరగడ్డ రమేష్ నాయుడు, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, స్పెషల్ ఆఫీసర్ పివి రమేష్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఎంపీడీవో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ నారదముని, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.