కృష్ణ

చంద్రబాబు పాలనలో ప్రతి కుటుంబానికీ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 12: తెలుగుదేశం పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడం జరుగుతోందని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఐదవ విడత జన్మభూమి ముగింపు సందర్భంగా శుక్రవారం స్థానిక హిందూ కళాశాల ప్రాంగణంలో ‘ఆనందహేల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బందరు నియోజకవర్గ స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు లింకేజీ రుణాలు, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను మంత్రి రవీంద్ర పంపిణీ చేశారు. రూ.93కోట్లు విలువ చేసే రుణాలను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆయా రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు పది రోజులు పాటు జన్మభూమి గ్రామసభలను నిర్వహించినట్లు తెలిపారు. గ్రామసభలు ఒక పండుగలా జరిగాయన్నారు. గ్రామాలలో ప్రజలు నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. రాష్ట్రంలో అరకోటి మందికి పెన్షన్‌లు ఇస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బందరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.1560 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చిన్నాపురం రహదారిలోని గుండేరుపై వంతెనకు రూ.30కోట్లు, భవానీపురం వారధికి రూ.70కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. మంగినపూడి బీచ్‌లో రూ.2కోట్లతో అంతర్గత రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మరో రెండున్నర కోట్ల రూపాయలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో త్వరలో రూ.13కోట్లతో 11 ఎకరాలలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేశారు. మార్చి నాటికి బందరు పోర్టును ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ముగింపు సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, చిన్నారులకు భోగి పండ్లు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్, టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ చైర్మన్ పి కాశీవిశ్వనాధం, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, గొర్రెపాటి గోపీచంద్, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

కంచికచర్ల, జనవరి 12: జాతీయ రహదారిపై కీసర సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన ఇద్దరు యువకులు (సోదరులు) మృతి చెందారు. ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉంటున్న కొటికలపూడి మోహన్ (30), భోగిరెడ్డి కిషోర్ (32)లు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరగా కీసర ఇనె్వంటా కెమికల్స్ సమీపంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ పోల్‌కు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ సీఐ మూర్తి, ఎస్‌ఐ సందీప్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.