కృష్ణ

21 నుండి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జనవరి 17: మండల కేంద్రం మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వతేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 21వతేదీ ఉదయం 8గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుని చేయనున్నారు. 22వ తేదీ సాయంత్రం 4గంటలకు శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7.30ని.లకు ఎదుర్కోలు, 8గంటలకు స్వామివారి దివ్య కల్యాణోత్సవం జరగనుంది. అనంతరం నంది వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. 23వతేదీ రాత్రి 8గంటలకు స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 24వతేదీన వసంతోత్సవం, అవభృద స్నానం, వేద పండిత సభ, పండిత సత్కారం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చివరి రోజైన 25వ తేదీన సుబ్రహ్మణ్య హవనం, తీర్ధ ప్రసాద వినియోగం జరుగుతుంది.