కృష్ణ

కుట్టి చంపుతున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: నగర ప్రజలకు సుఖ నిద్ర కరువవుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న దోమల దండుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాన్యుని నుంచి ఉన్నత స్థాయి వారి వరకూ ఎదుర్కొంటున్న దోమ కాటు సమస్య నుంచి తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒక పక్క స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకు కోసం పడుగులు పెడుతున్న వీఎంసీ అధికారులు లక్షలాది ప్రజల ఆరోగ్యం కోసం దోమల నిర్మూలకు సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రోజు 10 నుంచి 20 రూపాయల వరకూ ఖర్చు చేస్తూ మస్కిటో కాయిల్స్, ఎలక్ట్రికల్ రీఫిల్స్‌ను వినియోగించినా వాటి వలన సైడ్ ఎఫెక్ట్‌లకు గురవ్వడమే కానీ ఉపశమనం కలుగడం లేదు. దోమల నిర్మూలనకు వీఎంసీ లక్షలకు లక్షలు మించి కోట్లు ఖర్చు చేస్తున్నా పైసా ఉపయోగం కనిపించకపోవడం చేపట్టే చర్యల లోపమా లేక సిబ్బంది పనితీరు లోపమా అన్నది సంబంధిత అధికారులకే తెలియాలి. పొద్దుగాలం శ్రమించి రాత్రికి ఇంటికి చేరుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దోమల దండుకు పూడిక తీత లేని సైడ్ డ్రైన్లు, పిచ్చి మొక్కలు, అపరిశుభ్ర తాండవించే ఖాళీ స్థలాలే కాకుండా జన నివాసాల మధ్య పేరుకుపోతున్న చెత్త నిల్వలే దోమల వృద్ధికి కేంద్రాలుగా మారాయి. ఉదయానే్న పాల ప్యాకెట్ ఎంత ముఖ్యమో సాయంత్రానికి దోమల చక్రాల కొనుగోలు కూడా తప్పనిసరిగా మారి నిత్యవసరాల సరుకుల జాబితాలో చేరిపోయాయి. ఇటీవల కొద్ది నెలల క్రితం ఇంటింటికీ దోమ తెరలు కుటుంబానికి ఒక్కటి మాత్రమే పంపిణీ చేశారు. దీంతో ఇంటో ఒక్కరికే దోమ తెర పరిమితం కాక మిగిలిన వారికి దోమ కాటు తప్పడం లేదు. ఇదిలావుండగా కోట్లు ఖర్చు పెట్టి స్వచ్ఛ్భారత్, పరిసరాల పరిశ్రుభ్రత వంటి కార్యక్రమాలు చేపడుతున్నా అవి కూడా ‘షో’ చర్యలుగానే మిగిలిపోతున్నాయి. అత్యాధునిక వాహనాలను వినియోగించి చెత్తను తరలిస్తున్న అధికారులు, వీఎంసీకి సరైన డంపింగ్ యార్డు లేకపోవడంతో రోజుకు ఉత్పత్తి అవుతున్న 550 టన్ను చెత్తను ఎక్కడ వేయాలో తెలియక సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్ ఆవరణకు తరలిస్తున్న వైనంతో దాని చుట్టూ నివాసముంటున్న లక్షలాది ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు.
వీఎంసీ వార్షిక బడ్జెట్‌లో దోమల నిర్మూలన చర్యలకు వినియోగించే రసాయనాల కోసం సుమారు 80లక్షలకు పైగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇవి కాక అధికార, సిబ్బంది జీత భత్యాలు, వారి నిర్వహణ తదితరాలను పరిశీలిస్తే ఖర్చు కోట్లకు చేరుకుంటుంది. యాంటి లార్వా ఆపరేషన్ కోసం వినియోగించే ఏబేట్, ఎంఎల్ ఆయిల్ కొనుగోలుకు 46లక్షల 60వేలు, పెరిగిన దోమల నిర్మూలనకు పైరత్నం కోసం 40 లక్షల 41వేల రూపాయలను వినియోగిస్తున్నారు. వాస్తవానికి అధికారులు చేపట్టే దోమల నిర్మూలన చర్యలు కనీస ఫలితం ఇస్తే దోమ గుడ్డు దశలోనే నిర్మూలన అయి దోమ దశకు రాదు. అలాగే ఒక వేళ దోమల దశలో నిర్మూలిస్తే మళ్లీ గుడ్డు పెట్టే దోమలు కనిపించకూడదు. కానీ లక్షలు ఖర్చవుతున్న తరుణంలో ఇటు దోమలు కానీ, దోమ గుడ్డు కానీ నిర్మూలనవుతున్న పరిస్థితి కనిపించదంటే అధికారులు నిర్వహిస్తున్న ఆయా చర్యలు ఏపాటివో ఇట్టే చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దోమల నిర్మూనలో అధికారులు చేపట్టే చర్యల కన్నా దోమలే మరింత బలవంతమని నిర్థారణవుతోంది. రాష్ట్రాన్ని దోమల బారి నుంచి కాపాడేందుకు దోమలపై దండ యాత్ర అంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన దోమలపై దండ యాత్ర కూడా ఘోరంగా విఫలమైందన్న విషయం ప్రస్తుతం రాజ్యమేలుతున్న దోమల దండును చూస్తే అవగతమవుతోంది. ప్రస్తుతం దోమలపై దండ యాత్ర కన్నా దోమలే ప్రజారోగ్యం పై దండయాత్ర చేస్తున్నట్టు కనిపిస్తుండగా ఇప్పటికైనా అధికారులు మేల్కోనకపోతే గతంలో విజృంభించిన డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవ్వక తప్పదన్నది గత అనుభవాలే చెబుతున్నాయి.