కృష్ణ

బందరు పోర్టు ద్వారా జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 21: బందరు పోర్టు నిర్మాణం ద్వారా జిల్లా సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం తూర్పు కృష్ణా ప్రథమ మహాసభ తీర్మానించింది. స్థానిక పిన్నమనేని కళ్యాణ మండపంలోని మహిళా ఉద్యమనేత నాగళ్ళ రాజేశ్వరమ్మ వేదికపై జరిగిన ప్రథమ మహాసభల 2వ రోజు ఆదివారం పలు తీర్మానాలను మహాసభ ఆమోదించింది. కౌలు రైతులకు పంట రుణాలు, సబ్సిడీపై పరికరాలు ఇవ్వాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు విడనాడాలని తీర్మానంలో డిమాండ్ చేసింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, చుక్క భూముల రిజిస్ట్రేషన్ కొనసాగించాలని కోరింది. పామర్రు సమీపంలో రోషిణి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం, హనుమాన్‌జంక్షన్ డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ, కానూరు, ఎనికేపాడు, అవుటపల్లి, సూరంపల్లి క్లస్టర్లలోని పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. నష్టాల్లో ఉన్న బందరు రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను బతికించే చర్యలు చేపట్టాలని, ఆక్వా పీడిత మండలాలకు కృష్ణానది నుండి పైప్‌ల ద్వారా మంచినీటిని అందించే పథకాలను ప్రారంభించాలని, డెల్టా ఆధునీకరణ పనులు పూర్తిచేయాలని, 100కిలోమీటర్ల సముద్రతీరం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వ్యవసాయానికి రుణాలు మంజూరు చేయాలని కోరింది. కౌలు రైతులకు కూడా పంట రుణాలు, గుర్తింపు కార్డులివ్వాలని, విద్యార్థి, యువత, మహిళలు, చేతివృత్తులు, ఇతర సామాజిక తరగతుల సంక్షేమానికి పథకాలను అమలు చేయాలని తీర్మానంలో మహాసభ కోరింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు ముగింపు ఉపన్యాసమిస్తూ ప్రజాసమస్యలపై నిరంతరం స్పందిస్తూ, లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీపీఎం తూర్పు కృష్ణా ప్రధాన కార్యదర్శిగా ఆర్ రఘు మరోసారి ఎన్నిక కాగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా వై నరసింహారావు, ఎం హరిబాబు, సీహెచ్ రవి, కే వెంకటేశ్వరరావు, ఆర్‌సీపీ రెడ్డిలతో పాటు మరో 23మందిని ఎన్నుకున్నారు. ముందుగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఖాజన్‌దాస్ మృతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, ఎంబీ అధ్యయన కేంద్రం కార్యదర్శి పీ మురళీకృష్ణ, సీనియర్ నేత వై కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

భూగర్భజలాల పెంపునకు టెలీమెట్రీ స్టేషన్లు

కూచిపూడి, జనవరి 21: కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో పడే వర్షపాతాన్ని నమోదుచేసేందుకు 70కి పైగా టెలీమెట్రీ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర జలసంరక్షణ కమిషన్ చీఫ్ ఇంజనీర్ డి రంగారెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి నుండి కృష్ణా జిల్లా హంసలదీవి వరకు తెలంగాణ రాష్ట్రాలలో కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాన్ని గుర్తించి భూగర్భ జలాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదికలు అందచేస్తామన్నారు. ఇందులో భాగంగా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో పుష్కర రేవులో ఏర్పాటుచేసిన టెలీ మెట్రిక్ స్టేషన్‌ను పరిశీలించేందుకు విచ్చేసినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. డీఇఇ సీహెచ్ చక్రపాణి, జి శ్రీనివాసరావు, ఎఇ చైతన్యలతో కలిసి ఆయన ఆదివారం మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు దీవి వంశీమోహన్ ఆలయ చరిత్రను వివరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.