కృష్ణ

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జనవరి 21: మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాగశుద్ధ చవితి ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి గణపతి పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ తదితర పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసీ ఎం శారదా కుమారి స్వామివారి పట్టు వస్త్రాలను ఆలయ ప్రధాన అర్చకుడు బద్దు పవన్ కుమార్‌కు అందించారు. ఆలయ వేద పండితుడు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంటు ఎ మధుసూధనరావు, అధికారులు మల్లేశ్వరరావు, రామకృష్ణ, చెన్నకేశవ, వెంకటరమణ, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యూఎస్‌ఏలోని ప్ర వాసాంధ్రులు కానూ రి సత్య శివకాంత్, గీతా గాయత్రి దంపతులు 3.5 కిలోల వెండితో పంచహారతులు చేయించి సమర్పించారు. మరో ప్రవాసాంధ్రుడు కొమ్మిరెడ్డి అవినాష్, సాహితీ దంపతులు స్వామివారి ఉత్సవ మూర్తులకు వెండి కిరీటములు సమర్పించారు.