కృష్ణ

‘అభ్యున్నతి’కి సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 22: అభ్యున్నతి చేయూత పథకం కింద ప్రతి మండలంలో అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు మండల ప్రత్యేక అధికారులు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం ద్వారా ప్రతి మండలంలో అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి రూ.10వేలు ఆదాయాన్ని సమకూర్చాల్సి ఉంటుందన్నారు. డీఆర్‌డీఎ పరిధిలో స్వయం సహాయక సంఘాల ద్వారా సర్వే చేయించాలన్నారు. అదే విధంగా జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల డేటాను సమగ్రంగా కంప్యూటరీకరించి ఆ కుటుంబాలకు కూడా రూ.10వేలు ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీ విధానంలో ఆధార్ వేలిముద్రలు, ఐరిష్ ద్వారానే చెల్లించవల్సి ఉంటుందన్నారు. చంద్రన్న బీమాలో 35వేల మందికి ఇకెవైసీ నమోదు చేయాలన్నారు. జిల్లాలో 2లక్షల 33వేల మందికి రేషన్ అందుతుందని, వీరిని ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయాలని రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులను ఆదేశించారు. డ్వామాలో 25వేల మందికి జాబ్‌కార్డులు, గృహ నిర్మాణం ద్వారా 13వేల మందికి గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీరికి కూడా ఆయా శాఖలు ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయించాలన్నారు. ఈ సమావేశంలో జెసీ-2 పి బాబూరావు, డీఆర్‌ఓ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.