కృష్ణ

కమనీయంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జనవరి 22: మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కల్యాణం సోమవారం రాత్రి కమనీయంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణ ఘట్టానికి ముందు స్వామివారి ఏదుర్కోలు ఉత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్వామివారి తరపున ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదా కుమారి, పెదప్రోలు పీఎసీఎస్ అధ్యక్షుడు నాదెళ్ల శరత్‌చంద్రబాబు, ఎంపీటీసీ రావి రత్నగిరిరావు, అమ్మవార్ల తరపున ఆలయ ప్రధాన అర్చకుడు బద్దు పవన్ కుమార్ శర్మ, అర్చకులు బాలకృష్ణ శర్మ, నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యవారు, అమ్మవార్ల వివాహ నిశ్చయ సంభాషణలు ప్రేక్షకులను అలరించాయి. రాత్రి 9గంటలకు స్వామివారి దివ్య కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుడు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ప్రధాన అర్చకుడు బద్దు పవన్ కుమార్ శర్మ కల్యాణ తంతు నిర్వహించారు. స్వామివారి మాంగల్యధారణ ఘట్టం ప్రధాన అర్చకుడు బద్దు పవన్ కుమార్ శర్మ ప్రేక్షకులను తన్మయించే విధంగా నిర్వహించారు. స్వామివారి తలంబ్రాల ఘట్టం అర్చకుడు బాలకృష్ణ శర్మ తదితరులు నిర్వహించారు. ఎస్టేట్ దేవాలయాల ఏసీ ఎం శారదా కుమారి భక్తులకు తలంబ్రాలు చూపి స్వామివారికి సమర్పించారు. ఈ కల్యాణ మహోత్సవంలో ఆలయ సూపరింటెండెంట్ ఎ మధుసూధనరావు, అధికారులు మల్లేశ్వరరావు, తోట చెన్నకేశవ, రామకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోసూరు శివాజి, అవనిగడ్డ సీఐ మూర్తి, సీతారామాంజనేయులు, చందన రంగారావు, దుట్టా రవీంద్రనాధ్ ఠాగూర్, ఎంపీటీసీ రావి రత్నగిరిరావు, మత్తి రాంప్రసాద్, కోసూరు రామారావు, కామిశెట్టి శివనాగేశ్వరరావు, మండల టీడీపీ యూత్ అధ్యక్షుడు వి రాజా, భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన స్వామివారి గ్రామోత్సవం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోపిదేవి ఎస్‌ఐ నాగేంద్రరావు, ఎఎస్‌ఐ మాణిక్యాలరావు ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

బీజెపీలో అట్టహాసంగా మండవ నాని చేరిక
నందిగామ, జనవరి 22 : స్థానిక గాంధీ సెంటర్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో యువనాయకుడు మండవ భవానీ శంకర్ (నాని)ని కేంద్ర మాజీమంత్రి పురంధ్రీశ్వరి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారు కేదార్‌నాధ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహాత్మాగాంధీ, నందమూరి తారక రామారావు విగ్రహాలకు దగ్గుబాటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. మండవ నానితోపాటు పార్టీలో చేరిన గద్దె శివలను అభినందించారు. ఈ సభలో ఎమ్మెల్సీ మాధవ్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, యువ మోర్చా రాష్ట్ర నాయకుడు రమేష్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల అంజిబాబు తదితరులు ప్రసంగించగా జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, నియోజకవర్గ కన్వీనర్ పోరుగంటి నర్శింహరావు, రేగండ్ల రఘునాధరెడ్డి, షేక్ బాజీ, అశోక్, సైదా, జాన్సీ, మాధవి, నోముల రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధ్రీశ్వరిని మండవ నాని గజ మాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా తొలుత లక్ష్మీపురంలోని మండవ నాని గృహం నుండి భారీ బైక్ ర్యాలీగా రైతుపేట, పాతబస్టాండ్, మెయిన్ రోడ్డు మీదుగా గాంధీ సెంటర్‌కు నేతలు చేరుకున్నారు.