కృష్ణ

తల్లిని గౌరవించడం మన సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, జనవరి 22 : తల్లిని ప్రేమించడం, గౌరవించడం మన సంప్రదాయం అని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అమ్మ వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల చేత వారి తల్లులకు పాదాభివందనం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి దశ నుండే నైతిక విలువలను పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమ్మ వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 3500 అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మి, సర్వశిక్షా అభియాన్ పిడి ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.