కృష్ణ

రోస్టర్ రిజిస్టర్లను సోషల్ ఆడిట్ చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 22: ప్రతి క్యాడర్‌లోనూ రోస్టర్ రిజిష్టర్లను మాన్యువల్‌గా నిర్వహించి సోషల్ ఆడిట్ చేయించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కంపెనీతో పాటు కృష్ణా విశ్వ విద్యాలయాన్ని సందర్శించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరును పరిశీలించారు. రక్షణ శాఖకు సంబంధించి బెల్ కంపెనీలో తయారవుతున్న పలు పరికరాలను పరిశీలించి వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బెల్ కంపెనీ అధికారులతో సమావేశమైన శివాజీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు తీరును సమీక్షించారు. విభాగాల వారీగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఖ్య, బ్యాక్‌లాగ్ ఖాళీలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు సంబంధించి రిజిష్టర్ల నిర్వహణ తదితర అంశాల గురించి ఆరా తీశారు. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ తదితర ముఖ్యమైన క్యాడర్లలో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నుండి వచ్చిన గ్రీవెన్స్, పరిష్కార చర్యలపై అరా తీశారు. ప్రత్యేక శిక్షణ కోసం విదేశాలకు ఉద్యోగులను ఎందుకు పంపడం లేదని కారెం శివాజీ బెల్ అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు ఇటీవలే నలుగురు ఉద్యోగుల బృందాన్ని శిక్షణ నిమిత్తం అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అయితే వీసాలు రాని కారణంగా పంపలేకపోయామని బదులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లకు సంబంధించి అన్ని విభాగాల్లో రోస్టర్ రిజిస్టర్లను మాన్యువల్‌గా నిర్వహించటంతో పాటు సోషల్ ఆడిట్ చేయించి రాష్ట్ర కమిషన్ కార్యాలయానికి పరిశీలన కోసం పంపాలని ఆదేశించారు. కార్పొరేషన్ సామాజిక బాధ్యతగా సీఎస్‌ఆర్ నిధులు వినియోగంలో ఉద్యోగుల ఎస్సీ, ఎస్టీ సంఘాలను సంప్రదించి 15 శాతం ఎస్సీ, ఏడు శాతం ఎస్టీ ప్రాంతాల్లో ఖర్చు చేయాలన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయంలో కూడా ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ డి సూర్యచంద్రరావుతో కలిసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలును తెలుసుకున్నారు. విశ్వ విద్యాలయంలో ఎస్టీ రిజర్వేషన్‌ను పాటించడం లేదని తమ పరిశీలనలో వెల్లడైనట్లు తెలిపారు. ఎస్టీ అభ్యర్థులు రావడం లేదన్న సమాధానం సరి కాదని, ఎస్టీ పోస్టులను ఏవైనా కారణాలతో అభ్యర్థులు రాకపోతే తగిన ప్రచారం కల్పించి అభ్యర్థులు వచ్చేలా చూడాలన్నారు. వివిధ డిగ్రీ కోర్సులకు సంబంధించి సిలబస్ మెటీరియల్ విద్యార్థులకు ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సెమిస్టర్ సిస్టమ్ ప్రారంభం కాగానే విద్యార్థులకు మెటీరియల్ అందేలా చూడాలన్నారు. బాగా చదివే విద్యార్థులకు ఒక సబ్జెక్టులో 99 మార్కులు వచ్చినప్పటికీ మరో సబ్జెక్టులో జీరో మార్కులు రావడం, విద్యార్థులు రీవాల్యూషన్‌కు రూ.700లు కట్టి దరఖాస్తు చేసుకుంటే మార్కులు వచ్చినట్లు చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కె నరహరి వరప్రసాద్, రవీంద్ర, కార్యదర్శి ఆర్ సుబ్బారావు, బెల్ ఇన్‌ఛార్జ్ జీఎం ఆర్‌సి శాస్ర్తీ, ఎస్సీ, ఎస్టీ లైజనింగ్ అధికారి డి సహదేవుడు, హెచ్‌ఆర్ మేనేజర్ ఫణి కుమార్, బెల్ కంపెనీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పి నాగ మోహన్, మోహన్ నాయక్, సాంఘీక సంక్షేమ శాఖ జెడీ ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ సత్యనారాయణ, డీటీడబ్ల్యూఓ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.