కృష్ణ

రెండు మాసాల్లో లక్ష మంది పేదలకు ఇళ్ళ స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ativan half life levitra coupon

modafinil uk మైలవరం, జనవరి 23: వచ్చే రెండు మాసాల్లో రాష్ట్రంలో లక్ష మంది పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మైలవరం మండలంలోని 801 మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఉమ ముఖ్య అతిధిగా పాల్గొని పేదలకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఇళ్ళ స్థలాల కోసం ఎందరో పేదలు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మీ పట్టాను మీ ఇంటికి తెచ్చి ఇస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇళ్ళ పట్టాల పంపిణీ రాష్ట్రంలో తొలిసారిగా మైలవరంలోనే అందిస్తున్నట్లు తెలిపారు. మైలవరంలో ఇంకా మిగిలిన వారికి రెండు విడతల్లో అందిస్తామన్నారు. అర్హత కలిగిన అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరతానని స్పష్టం చేశారు.