కృష్ణ

పెన్షన్ల మంజూరులో నిబంధనల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 23: ఎటువంటి నిబంధనలు లేకుండా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దని మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థారుూ సంఘ సమావేశాల్లో ఆమె ఆదేశించారు. పెన్షన్ల మంజూరుపై ఆమె సమగ్రంగా చర్చించారు. ఇటీవల నిర్వహించిన ఐదవ విడత జన్మభూమిలో అత్యధికంగా పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పెన్షన్ల మంజూరు నిబంధనలు కఠినంగా ఉండటంతో ప్రజా ప్రతినిధుల నుండి సీఎంకు విజ్ఞప్తులు అందాయన్నారు. వికలాంగ, వితంతు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేకుండా మంజూరు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, దీన్ని ప్రజా ప్రతినిధులు తెలుసుకుని లబ్ధిదారుల ఎంపికకు కృషి చేయాలన్నారు. పలువురు సభ్యులు ఇతరత్రా పెన్షన్ల మంజూరులో కూడా నిబంధనలు సడలించాలని చైర్‌పర్సన్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా పరిషత్ నుండి ప్రభుత్వానికి తీర్మానం చేయడం జరుగుతుందని అనూరాధ తెలిపారు. కొంత మంది సభ్యులు చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవటం వల్ల వారి ఎకౌంట్లకు పెన్షన్ మొత్తం జమ అవుతుందని, దీన్ని కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ అనూరాధ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన మహిళా సాధికారత భవన నిర్మాణాలను మార్చి 8వతేదీన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఆ కేంద్రాల్లో మహిళలకు అవసరమైన చేతి వృత్తుల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు ఇవ్వాలని డీఆర్‌డీఎ అధికారులకు సూచించారు. నాబార్డు అధికారులు శిక్షణా తరగతులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, దీనిపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ రాజ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలో జీఎస్‌టీ అమలుపై స్పష్టత రావల్సి ఉందని, ఆ కారణంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. విద్య-వైద్య రంగాలపై జరిగిన సమీక్షలో పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని జెడ్పీ హైస్కూల్స్‌లో పదవ తరగతి విద్యార్థులకు అదనపు తరగతుల సమయంలో రెండు పూటలా పోషకాహారం పంపిణీకి చర్యలు తీసుకోవాలని జెడ్పీ ఇన్‌ఛార్జ్ సీఇఓ వెంకటేష్‌ను ఆదేశించారు. పాఠశాలలకు బయోఫెన్సింగ్ వల్ల సొమ్ము వృథా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండటం లేదని, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. కిచెన్ షెడ్స్ నిర్మాణాలు అసంపూర్తిగా జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ముందస్తు అడ్వాన్స్‌లు తీసుకుని నిర్మాణాలను అసంపూర్తిగా నిలిపి వేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ అనూరాధ ముందస్తు అడ్వాన్స్‌లు నిలిపి వేయాలని ఎస్‌ఎస్‌ఎ అధికారులను ఆదేశించారు. గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం పట్ల పోషకాహారం, చిరుధాన్యాల వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు ఆరోగ్య జ్యోతి కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ద్వారా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అంగన్‌వాడీల ద్వారా కిషోర బాలికలు, గర్భిణీలు, శివువులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారని, అయితే 35 సంవత్సరాలు దాటిన గ్రామీణ మహిళలకు చాలా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారన్నారు. గ్రామాల్లో ఎఎన్‌ఎంలతో పాటు సాధికారమిత్రలకు కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకునే కిడ్నీ రోగులకు నెలకు రూ.2500 చొప్పున ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అందించే వైద్యసేవలు సీహెచ్‌సీ స్థాయి వరకు విస్తరిస్తున్నట్లు, ఫిబ్రవరి 1వతేదీ నుండి ఉయ్యూరు, మైలవరం, నందిగామ, తిరువూరు, అవనిగడ్డ, గూడూరు, కైకలూరు, గన్నవరం, జగ్గయ్యపేట, పామర్రులో పది విజన్ సెంటర్లు ప్రభుత్వం ప్రారంభిస్తుందని, ఈ కేంద్రాల్లో పూర్తి స్థాయి ఎక్యుప్‌మెంట్‌తో పాటు టెలి ఆప్తమాలజీ విధానంలో ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాలు అందచేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డెప్యూటీ సీఇఓ కృష్ణమోహన్, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, డీఇఓ రాజ్యలక్ష్మి, ఎస్‌ఎస్‌ఎ పీఓ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.