కృష్ణ

పన్నుల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 23: జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో నీటి, ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. మంగళవారం మచిలీపట్నం పురపాలక సంఘ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన పన్నుల వసూళ్లు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూపేరుకుపోయిన పన్ను బకాయిలను తక్షణమే వసూలు చేయాలన్నారు. మార్చి నెలాఖరు లోపు లక్ష్యాలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. ప్రతి రోడ్డు క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలన్నారు. అలాగే మురుగునీటి కాలువల్లో సిల్టు తొలగించి పారుదలకు ఎటువంటి అవాంతరం లేకుండా చూడాలన్నారు. రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా ఇప్పటి నుండే ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లలో క్లోరినేషన్ చేయించాలన్నారు. మంచినీటి సరఫరాపై ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. పైప్‌లైన్, మోటార్ల మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. మచిలీపట్నం మున్సిపాల్టీలో 1850 గృహాలు మంజూరవ్వగా ప్రారంభమైన 1220 గృహ నిర్మాణాలను సత్వరం పూర్తి చేయాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని ఆర్డీవో జె ఉదయ భాస్కరరావును ఆదేశించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు వీధి బండ్ల వ్యాపారులకు ఐడీ కార్డులు అందచేయాలన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్నారు. పట్టణంలో 80 యానాది గృహాలకు రూ.10వేలు చొప్పున మరమ్మతుల కోసం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 150 మందికి వెంటనే కుట్టుమిషన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం (చంటి), కమిషనర్ జస్వంతరావు, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ నారదముని, మున్సిపల్ సహాయ కమిషనర్ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.