కృష్ణ

ప్రభుత్వాలు మేలు చేస్తానంటే కోర్టులు అడ్డురావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ‘ఏదైనా ప్రజా సమస్య మీద ప్రభుత్వాలు ముందుకొచ్చి మేలు చేస్తాయంటే ఏ కోర్డులూ అడ్డురావు, 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు గత మూడు సంవత్సరాలుగా రోజూ చచ్చి బతుకుతుంటే కోర్డులు పేరు చెప్పి ప్రభుత్వాలు కాలయాపన చేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదని’ జస్టిస్ బీ చంద్రకుమార్ అన్నారు. స్థానిక హనుమాన్‌పేటలోని చలసాని వేంకటరత్నం హాలులో మంగళవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుకున్నా ఆస్తులు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని అమ్మి బాధితులకు న్యాయం చేకూర్చడానికి ఇంత కాలయాపన తగదన్నారు. రాష్ట్రంలో 19.52 లక్షల మందికి రూ. 4వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే రూ. 8వేల కోట్ల విలువైన ఆస్తులుండి కూడా ఆలస్యం చేయడంలో ప్రభుత్వం ఆంతర్యం ఏమిటన్నారు. ఇప్పటి వరకు దాదాపు 180 మంది ఆత్మహత్యలు చేసుకున్నా అధికార పక్షాలకు చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమన్నారు. అగ్రిగోల్డ్ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అమ్ముకోవడమో, లేక వేరే కంపెనీలకు విక్రయించైనా సరే బాధితులకు మాత్రం తక్షణమే ఆదుకోవాలన్నారు. ప్రజలకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రాధమిక కర్తవ్యమన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో అగ్రి బాధితుల కోసం రూ. 4వేల కోట్లు కేటాయించి డిపాజిట్‌దారులకు అసలు మొత్తాలను చెల్లించాలని, ఆస్తులు అమ్మిన అనంతరం వడ్డీ ఇవ్వాలని ఆయన సూచించారు. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో పట్టుదలతో ఉద్యమాన్ని నడుపుతున్న అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్‌ను అభినందించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ అప్పుకలన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నందున ఈ సమస్య చాలా తేలికగా పరిష్కరించవచ్చన్నారు. సెంటిమెంట్లు, ప్రజల బలహీనతలపై ఆధారపడే రాజకీయాలు పోవాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మేథావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే బాధితులకు ఆదుకునేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షుడు బీ విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వీ తిరుపతిరావు,శేఖర్, నాయుడు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.