కృష్ణ

ముక్త్యాలను ముంచెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 13: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అశేషంగా తరలివచ్చిన భక్తులతో మంగళవారం ముక్త్యాల గ్రామం కిటకిటలాడింది. కృష్ణా, గుంటూరు, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చెందిన ప్రజలు ప్రత్యేకంగా నడిచిన ఆర్‌టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, వందల సంఖ్యలో ఆటోల్లో, ట్రాక్టర్‌లు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చి పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ్భవానీ ముక్తేశ్వరస్వామివారిని, చెన్నకేశవస్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3.30గంటల సమయానికే నదీ స్నానాలకు, స్వామివారి దర్శనాలకు అవకాశం కల్పించడంతో అశేష సంఖ్యలో భక్తులు ఆ సమయానికే క్షేత్రానికి తరలివచ్చారు. శివస్వాముల దీక్షల విరమణ అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. గతంలో ఏన్నడూలేని విధంగా లక్ష వరకూ భక్తులు శివరాత్రి తిరునాళ్లకు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. నదిలో స్నానాల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించడంతో పాటు పడవలను అడ్డంగా పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. నది వద్ద పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో భక్తులు ఉన్న నీళ్లలోనే స్నానాలు చేయడంతో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయంలోనూ బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూపద్ధతిలో భక్తులకు స్వామివారి దర్శన అవకాశం కల్పించారు. నందిగామ డీఎస్‌పీ రాధేష్ మురళి, జగ్గయ్యపేట సీఐ జయకుమార్ పర్యవేక్షణలో చిల్లకల్లు, జగ్గయ్యపేట ఎస్‌ఐలు సోమేశ్వరరావు, శ్రీహరి, పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వాహనాల పార్కింగ్ విషయంలో అధికారులు సరైన నిర్ణయం చేయకపోవడం వల్ల భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీమపందుల పెంపకం కేంద్రం ఎదుట ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశం ఇరుకుగా ఉండటంతో లోపలకు వెళ్లి వచ్చే వాహనాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే వందలాది వాహనాలు ఒక్క సారిగా తరలిరావడంతో కోటిలింగాల క్షేత్రం వరకూ వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి గంటల తరబడి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఏర్పాట్లను పర్యవేక్షించి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. కోటిలింగాల క్షేత్రానికి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పంచముఖ అమృతలింగేశ్వరస్వామివారికి ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొన్న భక్తులు స్వయంగా నర్మద బాణ శివలింగాలను పెద్ద సంఖ్యలో ప్రతిష్ఠించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ధూళిపాళ సుబ్రమణ్యం ఏర్పాట్లను పర్యవేక్షించి క్షేత్రంలో పది వేల మందికి అన్నసమారాధన ఏర్పాటు చేసారు. ముక్త్యాల క్షేత్రంలో కెసీపీ సిమెంట్స్ ఆధ్వర్యంలో అన్నసమారాధన, పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.