కృష్ణ

ఆన్‌లైన్‌లో ‘టెట్’కు అంతా రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 18: మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 21వతేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 50వేల 184 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుండగా జిల్లాలో 22 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. అత్యధికంగా విజయవాడ నగరంలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేయగా మరో 13 కేంద్రాలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ పరీక్ష కావటంతో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న కళాశాలలు, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్‌ను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. విజయవాడలోని డీవిఆర్ అండ్ హెచ్‌ఎస్ నిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కెబిఎన్ కళాశాల, ప్రయూత్య ఇన్‌ఫోటెక్(గవర్నర్‌పేట), విఎడబ్ల్యుడి ఇన్‌స్టిట్యూట్(లబ్బిపేట), లక్ష్మీబాలాజీ కంప్యూటర్స్(గొల్లపూడి), ఇన్నోగీగ్స్ టెక్నాలజీస్ (బెంజి సర్కిల్), ఐ ఆన్ డిజిటల్ జోన్ (పడమట), ఎస్‌ఎస్ ఫ్యూచర్ టెక్ (సూర్యారావుపేట), క్యూ టెక్నాలజీస్ (ఆరండల్‌పేట)ను పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. జిల్లా రూరల్‌కు సంబంధించి జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ఎస్‌వీహెచ్ ఇంజనీరింగ్ కళాశాల, ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల (గంగూరు), నున్న రోడ్డులోని లింగాయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ (మందలవారిగూడెం), ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కళాశాల, తిరువూరులోని శ్రీ వాహినీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఘంటసాల మండలం లంకపల్లి శ్రీ సన్‌ఫ్లవర్ ఇంజనీరింగ్ కళాశాల, జి.కొండూరు మండలం చెవుటూరులోని శ్రీ వాణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, జగ్గయ్యపేట విద్యానగర్‌లోని మండవ ఇంజనీరింగ్ కళాశాల, పెడన మండలం నందమూరు శ్రీ వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, గని ఆత్కూరు రోడ్డులోని అమృత సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కండ్రికలోని ఐ ఆన్ డిజిటల్ జోన్, ఉంగుటూరు మండలం తేళ్లప్రోలులోని ఉషారమా ఇంజనీరింగ్ కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.

గిట్టుబాటు కాని చెరకు సాగు

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 18: కృష్ణానదీ పరీవాహాక ప్రాంతమైన లంక భూముల్లో రైతులు విస్తారంగా సాగు చేస్తున్న చెరకుకు గిట్టుబాటు కావడం లేదని రైతులు తెలిపారు. ఎకరం చెరకు విత్తనం నాటాలంటేనే పొలంలో దుక్కులు, విత్తన సేకరణ, రవాణా, కూలీల ఖర్చులతో కలిపి సుమారు రూ.30వేల వరకూ ఖర్చవుతోందని రైతులు అంటున్నారు. ఆ తరువాత కలుపు నివారణ, ఎరువులు, జడలు కట్టటం వంటి పనులకు మరో రూ. 15వేలు ఆవుతోంది. ఏడాది పాటు ఎన్నో పాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెంచిన పంటను ఫ్యాక్టరీకి తరలించడానికి తలకుమించిన భారమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నరుకుడు కూలి అధికం
చెరకు పంటను నరికి ఫ్యాక్టరీకి తరలించాలంటే ప్రధానంగా కూలీల సమస్య ఎదురవుతోంది. గతంలో తెలంగాణా జిల్లాల నుంచి చెరకు నరకడానికి వలస కూలీలు మండలంలోని వివిధ గ్రామాలకు భారీగా తరలి వచ్చేవారు. కానీ మూడేళ్లుగా పరిమిత సంఖ్యలో కూలీలు వస్తున్నా, నరుకుడు కూలీని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. టన్ను చెరకు నరికి శుభ్రం చేయాలంటే కూలీలు సుమారు రూ.500 నుంచి 550 వరకు డిమాండ్ చేస్తున్నారు. గతంలో నరుకుడు కూలి ఖర్చు పరిమితంగా ఉండేది. చెరకు సాగు కోసం వేలాది రూపాయలు అప్పు చేసి అనంతరం చెరకు నరికి ఫ్యాక్టరీకి తరలించాలంటే మోయలేని భారమవుతోందని రైతులు అంటున్నారు. అలాగే రవాణా ఖర్చులు కూడా టన్నుకు ఆయా గ్రామాల దూరాన్ని బట్టి సుమారు రూ.650 నుంచి రూ.700 వరకు ఉంటోంది. ట్రాక్టర్ ద్వారా అయితే టన్నుకు రూ.750 నుంచి రూ.800ల వరకు ఉన్నది. దీనితో ఎకరం చెరకు (సుమారు 40 టన్నులు) నరికి, రవాణా చేయాలంటే సుమారు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెపుతున్నారు.

సాగు ఖర్చు పెరిగింది
సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో చెరకు రైతులకు కేసిపి యాజమాన్యం ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదు. అన్ని ఖర్చులు భరించి ఒక ఎకరం సాగుచేస్తే రూ.20 వేలు కూడా మిగలడం కష్టతరమవుతోందని రైతులు అంటున్నారు. కౌలు రైతుల పరిస్థితైతే మరింత దారుణంగా మారింది. కేసీపీ కర్మాగారం టన్ను చెరకు రూ.4000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరైన మద్దతు ధర లభించకపోవడంతో చెరకు సాగుపై రైతులు విముఖత ప్రదర్శిస్తున్నారు.