కృష్ణ

జగన్ ‘రాజీ’నామా డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 18: ప్రతిపక్షం రూపంలో రాష్ట్రంలో సంచరిస్తున్న దొంగల ముఠా ఆటలు కట్టడి చేస్తామని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ దొంగే దొంగా దొంగా అన్నట్టు ప్రతిపక్ష నేత జగన్‌తో పాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేస్తున్న అరాచకాలు రోజు రోజుకీ పెట్రేగిపోతున్నాయన్నారు. ఆర్థిక పరమైన నేరారోపణ కేసుల్లో ఎ1, ఎ2గా కొనసాగుతున్న జగన్, విజయసాయిరెడ్డి ప్రజల మధ్య తిరిగేందుకు అనర్హులన్నారు. మంత్రులపై విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మైనార్టీలకు రాజ్యసభ స్థానం ఇస్తానన్న జగన్ నేడు ప్లేటు మార్చి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పేరును తెర మీదకు తీసుకురావడంలో రాజకీయ దురుద్దేశం లేదా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట మీద నిలకడ లేని జగన్ రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో ఢీకొనే దమ్ము లేక జగన్ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారన్నారు. బీజేపీ-టీడీపీల మధ్య మైత్రి ఎప్పుడు వీడుతుందా.. అని జగన్ ఆశగా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. బేజేపీతో తమ పార్టీ విబేధిస్తే మరుక్షణం ఆలస్యంగా లేకుండా బీజేపీతో చెలిమి చేసేందుకు జగన్ ఉత్సాహం చూపుతున్నాడంటూ ఆరోపించారు. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిని ప్రజలు ఎన్నటికీ నమ్మరన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్ పాల్గొన్నారు.