కృష్ణ

ఉపాధిహామీ ద్వారా 36 వేల కోట్ల సీసీ రోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో 36వేల కోట్ల సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని రాష్ట్ర ఉపాధిహామీ మండలి డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు. తోట్లవల్లూరులో మంగళవారం ఆయన స్వగృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధిహామీ మండలి చైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఇందులో కూలీల బకాయిలు రూ.169 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉన్న బకాయిలు రూ.233 కోట్లు ఉన్నాయన్నారు. రైతులకు ఉపయోగపడే రోడ్లు అభివృద్ధికి అనుమతి ఇస్తామని తెలిపారన్నారు. రాష్ట్రంలో మొత్తం 56 వేల కిలో మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఇప్పటికి 36వేల కిలో మీటర్లు సీసీ రోడ్లు నిర్మించామని, మిగిలిన 20వేల కిలో మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని తెలిపారన్నారు. మార్చిలోపు 5వేల అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించాలని, బీసీ కార్పోరేషన్ ద్వారా నిర్మించే దోబీ ఘాట్‌లను ఉపాధి పథకంలో నిర్మించాలని ప్రతి పాదన వచ్చిందన్నారు. అలాగే తడ నుంచి ఇచ్చాపురం వరకు 970 కిలో మీటర్ల సముద్రతీరం వెంబడి తాటి, కొబ్బరి చెట్లను పెంచి నీరా తయారు చేయాలని తాను ప్రతిపాదన చేయగా సీఎం ఆమోదించారని గురుమూర్తి చెప్పారు.

సేల్స్ ఫోర్స్ డెవలపర్ రిలేషన్స్‌పై ఎల్బీఆర్సీఇలో సదస్సు

మైలవరం, ఫిబ్రవరి 20: స్థానిక ఎల్బీఆర్సీఇలో సేల్స్ ఫోర్స్ డెవలపర్ రిలేషన్స్ టీం నాలుగు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్ మంగళవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌నకు సుమారు 600 మంది విద్యార్థులు హాజరై న్యూ టెక్నాలజీస్‌పై శిక్షణ పొందనున్నట్లు ప్రిన్సిపాల్ కె అప్పారావు వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా శిక్షణ పొంది అడ్వాన్స్‌డ్ టెక్నికల్ స్కిల్స్‌ని విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ కె శ్రీనివాస్, ఎం చక్రవర్తి, సీఎస్‌సీ విభాగాధిపతి వెంకట నారాయణ, ఐటి విభాగాధిపతి నాగరాజు, ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.

‘కూచిపూడి’ పట్ల ఆసక్తి కలిగిస్తాం

కూచిపూడి, ఫిబ్రవరి 20: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నాట్యం పట్ల భావి భారత పౌరులైన విద్యార్థులు నేర్చుకునేందుకు ఆసక్తిని కల్పించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం తనవంతు కృషి చేస్తోందని విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు పేర్కొన్నారు. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి కళావేదికపై నిర్వహించిన భరతముని జయంత్యుత్సవాన్ని ఆచార్య రామకృష్ణారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కీ.శే వెంపటి రవిశంకర్, పసుమర్తి సీతారామయ్య భరతముని చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పులిపాటి కింగ్‌ను, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, కళారత్న ఎబి బాలకొండలరావును కళామండలి దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందర కృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీతలు డా. వేదాంతం రాధేశ్యాం, డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, పసుమర్తి రత్తయ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.