కృష్ణ

పడవలకు డీజిల్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్రంలోని అన్ని రకాల పడవల యజమానులకు డీజిల్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు మత్స్య శాఖ కమిషనర్ రామ్‌శంకర నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రానున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నాటికి ఆయిల్ సబ్సిడీని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను తమ శాఖ చేపట్టిందని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మరబోట్లు, ఫైబర్ బోట్లు, సంప్రదాయ పడవల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా తగు చర్యలు చేపట్టడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించుకోవచ్చన్నారు. తీర ప్రాంత మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేపల వేటలో శిక్షణ, వౌలిక సదుపాయాలు, వేట పరికరాల వినియోగం, రవాణా సౌకర్యాలు, నిల్వ పద్ధతులు, మార్కెటింగ్ సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిషరీస్ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2లక్షల నుండి రూ.3లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్డులు ఉన్న వారికి ఇతర ప్రభుత్వ రాయితీలతో పాటు ముద్రా లోన్‌లు లింక్ చేసేందుకు వీలుకలుగుతుందన్నారు. నీలి విప్లవం కింద ఆక్వా కల్చర్‌ను అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 70శాతం సబ్సిడీతో జీపీఎస్ పరికరాలు, లైఫ్ జాకెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు జీవించేందుకు జీవనభృతిని మూడు రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు 90శాతం సబ్సిడీతో వేట పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాగ రమేష్, మెకనైజ్డ్ బోట్ల యజమానుల సంఘం అధ్యక్షుడు మోకా రవి, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ కార్యదర్శి డా. రఘుప్రకాష్, విశాఖపట్నం సీఐఎఫ్‌టీ సైంటిస్ట్ డా. యు శ్రీ్ధర్, ఫిషరీస్ ఎడీలు సిహెచ్ శ్రీనివాసరావు, ఎవి రాఘవరెడ్డి, పి సురేష్, చక్రాణి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంపై దుష్ప్రచారం తగదు

* బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుమార స్వామి

అవనిగడ్డ, ఫిబ్రవరి 20: రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లా బీజెపీ అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. ఆంధ్రులకు అన్యాయం జరిగిందంటూ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ జరగని అన్యాయం ఇప్పుడు ఎందుకు జరిగిందన్నారు. మంగళవారం పులిగడ్డ అతిథి గృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేకమైన నిధులు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో ఇచ్చిందని, ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో చూపరన్న విషయం వారికి తెలుసని, అయినప్పటికీ బీజెపీని అల్లరి చేసేందుకు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు జెసీ దివాకరరెడ్డి, రాయపాటి సాంబశివరావు, టీజీ వెంకటేష్ టీడీపీని బీజేపీకి దూరం చేయాలనే ఉద్దేశంతో కుట్ర చేస్తున్నారని కుమార స్వామి పేర్కొన్నారు. మోదీ వెంట పేదలు ఉన్నారని అగ్ర కులాల వారు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వైసీపీ, కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వటం జరుగుతుందని, ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించడం, ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేయటం, పోలీసులు బంద్‌కు సహకరించమని ఆదేశించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం లోపాయకారీగా కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. అనంతరం సాగు నీరు అందక ఎండిపోయన ఆరుతడి పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. సమావేశంలో బీజెపీ నాయకులు గుడివాక అంజిబాబు, జివి నగరాయులు, భోగాది రమాదేవి, రామిశెట్టి శేషగిరిరావు, భోగాది చంద్రశేఖర్, అరుణ, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.