కృష్ణ

జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 23: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నిఘాను మరింత పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ అన్నారు. స్థానిక కలెక్టరేట్ మీ సేవ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించామన్నారు. జిల్లాలో ఉన్న అన్ని సీసీ కెమెరాల కదలికలను ఇక్కడి నుండే పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. 30 మంది నిరంతర పర్యవేక్షకులను నియమించనున్నట్లు తెలిపారు. ఎనిమిది నెలల వ్యవధిలో కమాండ్ కంట్రోల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. సీసీ కెమెరాలకు మరింత సాంకేతికతను జోడించి అన్ని కోణాల్లో దృశ్యాలను చిత్రీకరించడం జరుగుతుందన్నారు. రెడ్‌లైట్ వైలెటర్ డిటెక్టర్, ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రీడర్, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం, సర్వ్ లెన్స్ కెమెరా, పీటీజెడ్ విశే్లషణకు ఉపయుక్తంగా ఉండేలా జిల్లాలో 754 సీసీ కెమెరాల ఏర్పాటు జరుగుతోందన్నారు. మ్యాట్రిక్స్ సంస్థ ద్వారా ఈ కెమెరాలను జిల్లా వ్యాప్తంగా జనసమర్ధత, రద్దీ ప్రదేశాలు, జనం సంచరించే ప్రాంతాలు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎస్పీ సాయికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎండీ మహబూబ్ బాషా, చిలకలపూడి సీఐ దుర్గాప్రసాద్, మాట్రిక్స్ జనరల్ మేనేజర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి

ముసునూరు, ఫిబ్రవరి 23: సమస్యలుంటే రెండు గ్రామాల ప్రజలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సమస్యల వల్ల గొడవలు పడితే గ్రామాల్లో శాంతియుత వాతావరణం దెబ్బతింటుందని మచిలీపట్నం ముడా డిప్యూటీ కలెక్టరు టీ సీతారామమూర్తి పేర్కొన్నారు. మండలంలోని బలివే పంచాయితీ శివారు వెంకటాపురం గ్రామానికి చెందిన శ్రీసీతారామ మందిరం ట్రస్టి సభ్యులు ఆలయానికి సంబంధించిన భూమిని ఎల్లాపురం గ్రామరైతులు ఆక్రమించి దారిగా వాడుకుంటున్నారని, తమకు తెలియకుండానే సర్వేలు నిర్వహించి ఆలయానికి సంబంధించిన భూమిలో బౌండరీలు ఏర్పాటు చేశారని మీకోసంలో అర్జీ దాఖలు చేశారు. స్పందించిన కలెక్టరు లక్ష్మీకాంతం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ముడా డిప్యూటీ కలెక్టరును ఆదేశించగా ఆయన శుక్రవారం వివాదాస్పద భూమిని తహశీల్దార్ కేబీ సీతారామ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరుగ్రామాల రైతుల వాదనలు విన్నారు. భూమికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్లాపురం రైతులు తమకు వాగు అవతలవైపు కూడా భూమి ఉన్నదని, దానినే తాము రహదారి కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. గతంలో సర్వే చేసిన సర్వేయర్ కూడా వాగు అవతలకు కూడా ఎల్లాపురం సరిహద్దు ఉందని బౌండరీలు ఏర్పాటు చేశారు. కాగా తమకు తెలియకుండానే సర్వే చేసి రాళ్ళు పాతి మాకు ఇక్కడ వరకు ఉందని చెప్పడం పద్దతి కాదని, సర్వే చేసే సమయంలో తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని, వెంకటాపురం నుండి సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేయాలని వెంకటాపురం రైతులు తమ వాదనను వినిపించారు. ఈసందర్భంగా డిప్యూటి కలెక్టరు మాట్లాడుతూ ఉన్న ఆధారాలను బట్టి వాగు ఇరు గ్రామాలకు చెందినదిగా ఉందని, వాగు ఇవతల ఉన్న సీతారామ దేవాలయంలో ఎల్లాపురం గ్రామస్థులకు స్థలం ఏలా ఉంటుందని అన్నారు. గతంలో సర్వే క్షుణంగా జరిగినట్లు అనిపించడం లేదని, ఈ సమస్య పరిష్కారం కావాలంటే రెండు గ్రామాల వైపు నుండి సర్వే నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టరుకు నివేదించనున్నట్లు ఆయన విలేఖరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మరియన్న సర్వేయర్ శంకరరావు, రెండు గ్రామాల విఆర్‌ఓలు పవన్, శ్రీనివాసరావు, రెండు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.