కృష్ణ

వ్యధల నుండి ఉద్భవించేదే కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 25: రాజ్యాంగం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా రెండు రాష్ట్రాలకు చెందిన కవులను మాత్రం విభజించలేకపోయారని, ఆ కారణంగానే అవనిగడ్డలో నిర్వహిస్తున్న సహస్ర కవి సమ్మేళనానికి తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో కవులు తరలి వచ్చారని వక్తలు పేర్కొన్నారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో సహస్ర కవి సమ్మేళనం, వెయ్యి కవితల పండుగకు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కవి ఎలా ఉండాలి అనే విషయంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయని, కవి మట్టి నుండి తయారవుతారని, బాధ, కరువు, అవినీతి ఉన్న చోట కవులు పుడతారని పేర్కొన్నారు. కవిత శ్రమతో కూడుకున్నప్పటికీ పలువురిని ఆహ్లాదపరుస్తుందని పేర్కొన్నారు. వాల్మీకు కూడా ఆయన బాధలు నుండే రామాయణాన్ని రచించారన్నారు. కవిత్వం అనేది హృదయ కళ అని, ముసలి భయం కవికి ఉండదని వారు స్పష్టం చేశారు. ఈ సభకు ప్రముఖ కవి, పాత్రికేయుడు పుట్టి కృష్ణ అధ్యక్షత వహించగా డా. పేర్ల శ్రీనివాసరావు, డా. వై మోహనరావు, ఆంధ్రప్రభ సంపాదకుడు వైఎస్‌ఆర్ శర్మ, నందీ అవార్డు గ్రహీత డా. ప్రసాద్ జైనీ, పిచ్చియ్య చౌదరి, ఎఎస్‌ఆర్‌కె మూర్తి, మొవ్వ శ్రీనివాసరావు, సాగర్, ఎండివి శ్యామల, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శర్మను ఘనంగా సత్కరించారు. కవులు పాల్గొని కవి సమ్మేళనం చేశారు.