కృష్ణ

కేంద్ర నిధులతోనే నవ్యాంధ్ర నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 25: రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా, అంగీకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే నవ్యాంధ్ర నిర్మాణం జరుగుతుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగళ్ళ రఘునాధరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మైలవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర నిధులతో రాష్ట్రం సోకు చేసుకుంటూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ఇప్పటి వరకూ లక్షా 75 వేల కోట్ల రూపాయలు రాష్ట్భ్రావృద్ధికి కేటాయిస్తే దానికి సరైన లెక్కలు చెప్పకుండా నిధులను దుర్వినియోగం చేసి నేడు కేంద్రంపై ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల నేపధ్యంలో ప్రజలందరికీ వాస్తవాలను తెలియజేయాలనే తలంపుతో మార్చి 3న తమ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక హోటల్‌లో ఉదయం పది గంటలకు జిల్లా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్టప్రార్టీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జమ్ముల శ్యాం కిషోర్ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం అందించిన సొమ్ము, డీపీఆర్ లేని రాజధాని గురించి, విశాఖ రైల్యే జోన్, పోలవరం ప్రాజెక్టు వివరించటంతోపాటు అనేక దేశాలకు మందీ మార్బలంతో స్పెషల్ ఫ్లైట్‌లలో రాష్ట్ర నేతలు తిరిగి సొమ్ము ఎలా వృధా చేసిందీ, విదేశాలలో తిరిగి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని, ఎంఓయులలో ఎన్ని క్రియారూపం దాల్చాయో ఈ సమావేశంలో నేతలు వివరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మైలవరం మండల పార్టీ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, నేతలు జె శేఖర్, నరేంద్ర, నాగరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

సోనీ ఆశయ సాధనకు కృషి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 25: అమరజీవి సోని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకుడు, పీడిత ప్రజల ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం సహాయ కార్యదర్శి కామ్రేడ్ యద్ధనపూడి సోని సంస్మరణ సభను సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పరాసుపేట సువర్ణ కల్యాణ మండపంలో నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకురాలు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సభలో విజయ్ కుమార్ మాట్లాడుతూ యద్ధనపూడి సోని మృతి బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షక, సీపీఐ పార్టీకి తీరని లోటన్నారు. బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, సీపీఐ (ఎంఎల్) తెలంగాణ రాష్ట్ర నాయకుడు రవన్న, ఎఐఎఫ్‌టీయు (న్యూ) అధ్యక్షుడు జి కిషోర్‌బాబు, స్ర్తి విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు చల్లపల్లి విజయ తదితరులు సోని పోరాట పటిమను ప్రశంసించారు. తొలుత సోని చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు సబికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.