కృష్ణ

విభజన హామీలు అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై ఏపీ ఎన్‌జీఓలు మంగళవారం పుర వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. తూర్పు కృష్ణా ఎన్‌జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు భారీగా హాజరైన ఈ ర్యాలీని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వుల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలన్నారు. 9, 10 షెడ్యూలులోని ఆస్తులను వెంటనే పంపిణీ చేయాలని, విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీఓ నాయకులు కెఎ ఉమామహేశ్వరరావు, టి నాగరాజు, లెనిన్ బాబు, మట్టి రాజేష్, పివి సాయికుమార్, ఎ శ్రీనివాసరావు, శంకర్, ఎల్‌వి సూర్యకుమారి, ఎ వెంకటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, రామారావు, వి సీతారామయ్య, కె గౌరి, ఎ రమాదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వల్లభా గణపతి స్వామికి రాజదర్బారు

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 13: స్థానిక బుట్టాయిపేట శ్రీ వల్లభాంబ సమేత మహా గణపతి పంచాయతన క్షేత్రంలో నిర్వహిస్తున్న తృతీయ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం విష్ణ్భుట్ల సూర్యనారాయణ శర్మ ఘనపాఠి ఆధ్వర్యంలో స్వామివారికి సహస్ర కలశ గో క్షీరాభిషేకం, చిట్టి పిళ్లారయ్య స్వామికి నవ విధ ద్రవ్యాలతో అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం వల్లభా గణపతి స్వామివారికి, చిట్టి పిళ్లారయ్య స్వామి వారికి సహస్ర దీపాలంకార పూర్వక సకలోపచార రాజదర్బారు సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాణి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మొదలి చంద్రశేఖర్ నేతృత్వంలో నిర్వహించిన నాదార్చన శ్రోతలను అలరించింది.

నాలుగు ఇళ్లు దగ్ధం

పెడన, మార్చి 13: మండల పరిధిలోని నందమూరు గ్రామ శివారు తోటవానిపాలెంలో మంగళవారంనాడు నాలుగు గృహాలు దగ్ధమై సుమారు 10లక్షల ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రమాదంలో గంజాల నరసింహారావు, కె ప్రసాద్, గంజాల గోవిందరాజులు, జి బోడిమ్మలకు చెందిన తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. నరసింహారావు ఇంట్లో రూ.4లక్షల నగదు, గోవిందరావు ఇంట్లో రూ.లక్ష నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాంప్రసాద్ ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సర్పంచ్ పరసా రాంబాబు కూడా బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని అందజేస్తామని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు.