కృష్ణ

మినుము రైతులను ముంచిన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): మినుముల ధరలు జిల్లా రైతులను నడ్డి విరుస్తున్నాయి. ధరలకు తోడు దిగుబడులు కూడా ఆశాజనకంగా లేకపోవటంతో ఈ ఏడాది అప్పులను మూటగట్టుకొవల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 కిలోల మినుములు రూ.4,800లు మాత్రమే ధర పలకటంతో ఆ ధరకు అమ్మలేక కొంత మంది రైతులు నిల్వ చేసుకుంటుండగా ధరలు తక్కువగా ఉండటంతో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వీరు మాత్రం మినుములను అయిన కాడికి తక్షణమే అమ్ముకుని చేసిన అప్పులను తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిన కాడికి అప్పులు చేసి పంటలను కాపాడుకున్న రైతులకు ధరలు షాకిచ్చాయి.