కృష్ణ

కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండవల్లి: మండల పరిధిలోని పులపర్రు గ్రామంలోని కొల్లేరు అభయారణ్యంలో గత మూడు రోజులుగా యధేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. 2006వ సంవత్సరంలో కొల్లేరు అక్రమణలకు గురైందని సుప్రీం కోర్టు సాధికారిక కమిటీ ఆదేశాల మేరకు కొల్లేరులోని అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. నియోజకవర్గ రాజకీయ నాయకుల అండదండలతో కొంతమంది స్వార్థపరులు మళ్లీ కొల్లేరును చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో అంగబలం, అర్థబలం ఉన్నవారు కొల్లేరులో అక్రమణలకు తెగబడుతున్నారు. గ్రామ పరిధిలోని కొల్లేరులో (+5 కాంటూరు) సుమారు 45 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా 4 పొక్లెయిన్లతో మంచినీటి చెరువు కోసమంటూ చేపల చెరువు తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనల మేరకు కొల్లేరులో ఎటువంటి ఇంజన్లు, యంత్రాలను వినియోగించరాదు. కానీ పులపర్రులో మూడు రోజులుగా నిబంధనలకు పాతరవేసి అక్రమంగా భారీ పొక్లెయిన్లు ప్రవేశించి తవ్వకాలు సాగిస్తున్నా అటవీ శాఖాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పులపర్రు గ్రామ పరిధిలోనే గాక ఇంగిలింపాకలంక, చింతపాడు, మణుగులూరు, కొవ్వాడలంక, దయ్యంపాడు, నుచ్చుమిల్లి, నందిగామలంక, పెనుమాకలంక గ్రామాల్లో కొంతమంది క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది సహకారంతో ఇటీవల కొందరు అక్రమ చేపల చెరువు తవ్వకాలు సాగించారు. ఇదేంటని ప్రశ్నించిన అధికారులకు మాత్రం వారు తవ్వుతున్నది మంచినీటి చెరువుకని చెబుతున్నారు. అక్రమ తవ్వకాల విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లటంతో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది లేడికి లేచిందే పరుగన్నట్టు, అప్పుడే తమకు తెలిసినట్టు మంగళవారం మధ్యాహ్నం అక్రమ తవ్వకాలను అడ్డుకోవటానికి హడావుడి చేశారు. అక్రమ తవ్వకాలను నిలుపు చేసి ప్రొక్లైన్ సీజ్ చేయడానికి ప్రయత్నించగా, ప్రొక్లైన్ సీజ్ చేయవద్దంటూ వారిని అడ్డుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండతో తవ్వకాలు సాగిస్తున్న బడాబాబులు గ్రామస్థులను ముందు పెట్టి అటవీ అధికారులు, సిబ్బందిని మహిళలు చుట్టుముట్టారు. అధికారులను, అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో గ్రామస్థులు వాగ్వివాదానికి దిగారు. అటవీ శాఖ అధికారులను చుట్టుముట్టారన్న సమాచారం తెలుసుకున్న మండవల్లి, కైకలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ప్రయత్నించారు. అధికారులను గ్రామస్థులు చుట్టుముట్టి కొల్లేరులో తవ్వుతున్న మూడు ప్రొక్లైన్‌లు అక్కడ నుంచి దారి మళ్లించారు. సంఘటన స్థలానికి వెళ్లటానికి ప్రయత్నించిన విలేఖర్లపై కొంతమంది గ్రామస్థులు దౌర్జన్యం చేయటానికి ప్రయత్నించారు. అక్రమ తవ్వకాలపై ఎవరిపైనైనా కేసులు నమోదు చేశారా? అని రేంజర్ విజయను వివరణ అడగగా ఆమె చెప్పటానికి నిరాకరించారు. వివరణ ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించగా, తాను ఫోన్‌లో సమాధానం చెప్పనని కార్యాలయానికి వస్తే చెబుతానని ఆమె పేర్కొనటం విశేషం.

టెన్త్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

* జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి

మచిలీపట్నం, మార్చి 13: జిల్లాలో గురువారం నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ నెల 15వతేదీ నుండి 29వతేదీ వరకు పరీక్షలు జరగనున్న దృష్ట్యా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా విద్యార్థులకు పరీక్షలు వెళ్లే క్రమంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కూడా అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు సిబ్బంది ట్రాఫిక్ సమస్యను నివారిస్తారన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఒక వేళ పరీక్షా కేంద్రానికి వెళ్లడం ఆలస్యమైతే అందుబాటులో ఉన్న పోలీసుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో 163 పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఎటువంటి ఇంటర్‌నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండకూడదన్నారు. ఎవరైనా తెరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మానసిక ప్రశాంతతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ త్రిపాఠి విద్యార్థులకు సూచించారు.