కృష్ణ

నీటి చౌర్యానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మంచినీటి అవసరాల నిమిత్తం కాలువలకు నీరు విడుదల చేసిన నేపథ్యంలో ఈ నెల 31వతేదీ లోపు జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివారు ప్రాంతాలైన కృత్తివెన్ను, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ ప్రాంతాలకు నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి చౌర్యానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.62కోట్లు విడుదలైన నేపథ్యంలో వీటిని మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న చేపల చెరువుల తవ్వకాలను నియంత్రించాలన్నారు. వడదెబ్బ నివారణకు ప్రతి గ్రామ పంచాయతీలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. నందిగామలో ఆక్రమాలకు పాల్పడుతున్న పెట్రోలు బంక్‌ను తక్షణమే సీజ్ చేయాలని డీఎస్‌ఓ నాగేశ్వరరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబేద్కర్, ముడ వీసీ విల్సన్ బాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, జెడ్పీ సీఇఓ శ్రీదేవి, డీపీఓ ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు.

రూ.31.46లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 19: వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న 29 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.31లక్షల 46వేల 486లు మొత్తాన్ని సోమవారం చెక్కుల రూపేణా మంత్రి రవీంద్ర అందచేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల జగన్నాధరావు, బూరగడ్డ రమేష్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఆస్పత్రి వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడు ‘కనకమేడల’కు ఘన సన్మానం
అవనిగడ్డ, మార్చి 19: రాజ్యసభ అభ్యర్థిగా నియమితులైన దివిసీమ వాసి, ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్‌ను సోమవారం ఘనంగా సత్కరించారు. స్థానిక గాంధీక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రవీంద్ర కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దివిసీమ ప్రాంతం జయపురం గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ అవనిగడ్డ సొసైటీ సభ్యులు ఎస్‌ఆర్‌ఎస్‌కె ప్రసాద్, ఎంపీపీలు కనకదుర్గ, ఎం జయలక్ష్మి, యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, జెడ్పీటీసీలు పి కృష్ణకుమారి, కె వెంకటేశ్వరరావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి రాజా తదితరులు పాల్గొన్నారు.

వేద పండితుడు నౌడూరికి ఉగాది పురస్కారం
మోపిదేవి, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలలో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల వేద పండితుడు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.