కృష్ణ

ఢిల్లీ పీఠాన్ని కదిలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 23: ఆంధ్రుల సత్తా ఏమిటో కేంద్రానికి చూపిద్దాం.. హోదా కోసం మొదలు పెట్టిన ఉద్యమానికి ఢిల్లీ పీఠాన్ని కదిలిద్దాం.. జాతీయ రహదార్ల దిగ్బంధనం స్ఫూర్తితో మరిన్ని బహుముఖ ఉద్యమాలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి హోదా కోసం పోరాడదామని ఆఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని), కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీతో పాటు ఇతర రాజకీయ పక్షాల నేతలు హాజరై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. జిల్లా కోర్టు సెంటరు నుండి కోనేరుసెంటరు వరకు నిర్వహించిన కాగడాల ప్రదర్శనలో టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు వందలాదిగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రజా జీవనాన్ని స్తంభింప చేసైనా ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ, వైసీపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవటం పట్ల మండిపడ్డారు. జాతీయ రహదార్ల దిగ్బంధనంతో ఆంధ్రుల సత్తా ఏమిటో కేంద్రానికి రుచి చూపించామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కేంద్రంపై ఉద్యమించేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించని పక్షంలో ఈ నెల 27వతేదీన అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు, 28న విజయవాడలో అన్ని విద్యార్థి సంఘాలతో జెఎసీ ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపు తీసుకు వస్తామన్నారు. సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రుల దమ్మేంటో కేంద్రానికి చూపించాల్సిన సమయం అసన్నమైందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసే వాళ్లు ఎవరైనా మట్టి కొట్టుకుపోతారని ధ్వజమెత్తారు. కుల, మతాలతో మనలో మనకి చిచ్చు పెట్టే ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ద్వంద వైఖరి వల్లే నేడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో అనేక అనుమానాలకు రేకెత్తిస్తోందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీమోహనరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొడాలి శర్మ, పట్టణ కార్యదర్శి చౌటపల్లి రవి, సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు మోదుమూడి రామారావు, బందరు నియోజకవర్గ కార్యదర్శి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు షేక్ సలార్ దాదా, షేక్ అచ్చాబా, జనసేన నాయకుడు వాలిశెట్టి మల్లి తదితరులు పాల్గొన్నారు.