కృష్ణ

జిల్లాలోనే లక్ష్యాన్ని అధిగమించిన జగ్గయ్యపేట యార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, మార్చి 23: జిల్లాలో స్థానిక మార్కెట్‌యార్డ్ లక్ష్యాన్ని అధిగమించిందని యార్డ్ చైర్మన్ మల్లెల గాంధీ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పేట మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పేట మార్కెట్‌యార్డ్ లక్ష్యం రూ.3కోట్ల 17లక్షలు కాగా ఇప్పటి వరకూ రూ.3 కోట్ల 33 లక్షలు అందించినట్లు తెలిపారు. మరో 8లక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలానే మార్కెట్‌యార్డ్‌లో సోలార్ పవర్‌సిస్టమ్ ఏర్పాటు చేసిన యార్డ్‌గా జగ్గయ్యపేట నిలిచిందని, యార్డ్‌లో 20కెవి సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రోజుకు 80 యూనిట్‌ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, యార్డ్ నిర్వహణకు పోను మిగిలిన విద్యుత్‌ను విద్యుత్ సంస్థకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలానే సుమారు 3కోట్లతో త్వరలో శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నట్లు, దానికి కూడా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2014-15, 17-18 సంవత్సరానికి సంబంధించి డొంక రోడ్ల అభివృద్ధికి రూ.90లక్షలతో ప్రతిపాదనలు పెట్టామని, ప్రభుత్వం నుండి మరో రూ.90 లక్షల రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యార్డ్ కార్యదర్శి నర్సింహారావు, వైస్ చైర్మన్ గఫూర్, డైరెక్టర్ నూకల బాలకృష్ణ, మహాంకాళి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

కూచిపూడి, రాజమండ్రి పీఠాలలో దూర విద్య కోర్సులకు అనుమతి

కూచిపూడి, మార్చి 23: ఎట్టకేలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థానిక సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం శ్రీశైలం పీఠాలలో దూర విద్య కోర్సు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జీవో జారీ చేసినట్లు స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ శుక్రవారం తెలిపారు. కూచిపూడి, శ్రీశైలం పీఠాలలో దూర విద్య కోర్సు పరీక్షలు రద్దు చేసినట్లు ప్రకటనలు వెలువడటంతో మీడియాలో వెలువడిన వివిధ కథనాలను, ముఖ్యంగా ఆంధ్రభూమిలో వెలువడిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్న విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య అలైక్య పుంజాల పరీక్ష కేంద్రాలను తిరిగి పునరుద్ధరించినట్లు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ నెల 31వ తేదీ లోగా రూ.300 అపరాధ రుసుముతో 2017-18 విద్యా సంవత్సరంలో పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సులలో చేరే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ ప్రకటన విడుదల జేశారన్నారు. పీజీలో ఎంఎ తెలుగు, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, సంస్కృతం, జ్యోతిష్యం, ఇఎల్‌టీ, టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సులు, డిగ్రీలో బిఎ కర్ణాటక సంగీతం, స్పెషల్ తెలుగు, డిప్లమాలో టీవీ జర్నలిజం, జ్యోతిష్య వాస్తు, సినిమా రచన, సంగీతం, సర్ట్ఫికెట్ కోర్సులలో శిక్షణ పొందేందుకు అవకాశం ఏర్పడిందని ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ తెలిపారు.

వరి కుప్పలు దగ్ధం

కూచిపూడి, మార్చి 23: గుర్తు తెలియని వ్యక్తుల ఆక్రోశానికి కౌలు రైతుకు చెందిన రూ.లక్షా 60వేలు విలువ గల 2.3 ఎకరాల వరి కుప్పలు దగ్ధమైన సంఘటన గురువారం అర్ధరాత్రి మొవ్వ మండలం కోసూరు గ్రామంలో చోటు చేసుకుంది. కౌలు రైతు మహళి లక్ష్మణరాజు సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదం శుక్రవారం ఉదయం కుప్పలు నూర్చేందుకు వెళ్లిన తమకు దగ్ధమైన కుప్పలు కనిపించాయని వాపోయాడు. వేములమడ రాంబాబుకు చెందిన పొలాన్ని తాను గత కొన్ని సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్నాని, వరి పంటపై ఆశలు పెట్టుకున్న తనకు కుప్పలు దగ్ధం కావటంతో నిరాశకు గురై అప్పుల బారిన పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు.