కృష్ణ

హోదా కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకైనా తాము సిద్ధమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యేక సాధన సమితి చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణను శుక్రవారం మచిలీపట్నం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన తెలియచేశారు. ఈ నెల 22వతేదీన నిర్వహించిన జాతీయ రహదార్ల దిగ్బంధనం కేంద్రానికి తాకిందన్నారు. రహదార్ల దిగ్బంధనం కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన రాజకీయ పక్షాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హోదా కోసం రానున్న రోజుల్లో మరింత వ్యూహాత్మకంగా ప్రత్యేక హోదా సాధన సమితి వ్యవహరిస్తుందన్నారు. ఈ నెల 27వతేదీన రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 28వతేదీన విజయవాడలో అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అతి పెద్ద జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ ద్వారా దీర్ఘకాలిక ఉద్యమానికి తెర లేపనున్నట్లు వివరించారు. దీంతో పాటు న్యాయవాదులు, మహిళా సంఘాలతో కలిసి బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు కలిసి రాని రాజకీయ పక్షాలు ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతాయన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ రహదార్ల దిగ్బంధనానికి అన్ని రాజకీయ పక్షాలతో పాటు టీడీపీ కూడా కలిసి రావటం ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. అయితే కేంద్రంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో కూడా ఆఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమం సరికొత్త మలుపు తిరగనుందన్నారు. ఉమ్మడి ఉద్యమంలో కలిసి రాని వాళ్లు ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. జాతీయ రహదార్ల దిగ్బంధనం స్ఫూర్తితో సరిహద్దు ప్రాంతాల దిగ్బంధనానికి పూనుకుంటామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుండి ఉత్తరాద్రి రాష్ట్రాలకు వెళ్లే సరిహద్దులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలు చివరి వరకు ఉండకుండా వెనక్కి వస్తే ఆ రోజే రాత్రి 7గంటల నుండి 7.30ని.ల వరకు ప్రజలంతా స్వచ్చందంగా విద్యుత్ బంద్ చేసి చీకటి దినంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఎ నుండి తెలుగుదేశం బయటకు వచ్చినా సుజనా చౌదరి నేటికీ బీజేపీతో కలిసి ప్యాకేజీల కోసం పాకులాడటం గర్హనీయమన్నారు. ప్యాకేజీ ప్రకటించిన నాడే అధికార తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకుంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా టీడీపీ తన వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

*గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జి రావి

గుడ్లవల్లేరు, మార్చి 23: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ నాయకులు మండలంలోని అన్ని గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గుడివాడ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొసరాజు వెంకటాద్రి చౌదరి గుడ్లవల్లేరులో బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతూ పదేళ్లపాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పగా ప్రత్యేక హోదా పదేళ్లు కాదు 15 యేళ్లు కావాలని బీజెపీ ప్రతిపక్ష నేత వెంకయ్య నాయుడు కోరారన్నారు. ఈ నాడు ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం దారుణమన్నారు. అనంతరం అంగలూరు, చంద్రాల, విన్నకోట, కూరాడ, కౌతవరం, వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, డోకిపర్రు, పెంజాండ్ర, పోలిమెట్ల, కుచ్చికాయలపూడి, శెరికల్వపూడి మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఇన్‌చార్జి అడుసుమిల్లి రామ్మోహనరావు(చిట్టిబాబు), పొట్లూరి రవి కుమార్, పోలవరపు వెంకట్రావ్, వెనిగళ్ల నాగేశ్వరరావు, జంగం మోహనరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.