కృష్ణ

మాస్టర్ ప్లాన్‌తోనే స్థిరమైన అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం సుస్థిర అభివృద్ధికి దోహదపడే మాస్టర్ ప్లాన్‌ను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్లు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) వైస్ చైర్మన్ విల్సన్ బాబు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయల్ హాస్కానింగ్ సంస్థ గత డిసెంబర్‌లో ముడ మాస్టర్ ప్లాన్ తయారు టెండరును దక్కించుకుందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో మాస్టర్ ప్లాన్ తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తుందన్నారు. అమృత పథకం, స్మార్ట్ సిటీ గైడ్‌లైన్స్ కూడా పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తారన్నారు. ప్రధానంగా ఏయే ప్రాంతాల్లో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ మెగా టౌన్ షిప్ నిర్మించాలి తదితర అంశాలతో పాటు రోడ్లు, డ్రైనేజీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి మాస్టర్ ప్లాన్ తయారీ జరుగుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ తయారీకి ముడ ద్వారా ఇరువురు సీనియర్ ప్రొఫెసర్ల సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఓడరేవు నిర్మాణంతో ఏర్పడే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిని మరలా విస్తరించే విధంగా కూడా ప్రతిపాదనలు ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలను గుర్తించే విధంగా ఈ ప్రాంత అభివృద్ధిని సూచించే విధంగా ముడ తరఫున ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించనున్నట్లు వివరించారు. ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ముడ నూతన కార్యాలయ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో ముడ ప్లానింగ్ అధికారి వి శిల్ప, పరిపాలన విభాగం తహశీల్దార్ తోట రాధాకృష్ణ పాల్గొన్నారు.

అవసరమైన విషయాలపైనే విద్యార్థులు
దృష్టి సారించాలి

గుడ్లవల్లేరు, మార్చి 23: నేటి విద్యార్థులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో అవసరమైన విషయాలపైనే దృష్టి సారించాలని రాష్ట్ర కౌన్సిలింగ్ ఆఫ్ హయర్‌ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొ. సువర్ణకంటి విజయరాజు అన్నారు. స్థానిక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల 20వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు, నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ సోషల్ నెట్‌వర్క్‌లో అనవసరమైన విషయాలతో సమయం వృధా చేయరాదని విద్యార్థులను కోరారు. నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. నేటి సమాజంలో 70శాతం విద్య కార్పొరేట్ సెక్టార్‌లో ఉందని, అది కొంత వరకే వాణిజ్య పరమైన విషయంగా సాగుతుందన్నారు. అనంతరం విక్రమ్ తారాబాయ్, స్పేస్ కమీషన్ సభ్యులు పద్మశ్రీ ఎఎస్ కిరణ్ కుమార్ చేతులు మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి రవీంద్రబాబు, కళాశాల ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు, చైర్మన్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ వల్లూరుపల్లి సత్యనారాయణ, వల్లూరుపల్లి రామకృష్ణ, డా. వై రావ్ తదితరులు పాల్గొన్నారు.