కృష్ణ

బంద్ కారణంగా ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు చేస్తున్న బంద్ కారణంగా సోమవారం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు బ్రేక్‌పడింది. జి.కొండూరు మండలంలోని కందులపాడు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో జగన్ బస చేశారు. జగన్‌ను కలిసేందుకు ఆయన సతీమణి భారతి, పిల్లలు కూడా ఇక్కడకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ 1780 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర పూర్తయింది. కాగా జగన్‌ను ఎలాగైనా కలుసుకోవాలనే ఆకాంక్షతో చాలామంది సోమవారం కందులపాడు వద్దకు చేరుకుంటున్నారు. కాని ఆయన ఎవరినీ కలిసే అవకాశం లేని కారణంగా నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. మరుసటి రోజు ఉదయం రమ్మని ఆయన సెక్యూరిటీ సిబ్బంది చెప్పి పంపుతున్నారు. మంగళవారం ఉదయం కందులపాడు నుంచి హెచ్.ముత్యాలంపాడు, ఆత్కూరు, చెవుటూరు, వెంకటాపురం, కుంటముక్కల క్రాస్‌రోడ్, గుర్రాజుపాలెం క్రాస్‌రోడ్ మీదుగా మైలవరం చేరుకోనుం ది. మైలవరం పట్టణంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నట్లు సమాచారం. జగన్‌కు జోగి రమేష్, కాజ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పోటాపొటీగా ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులన్నింటినీ ఫ్లెక్సీ బ్యానర్లతో నింపేశారు. పాదయాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసరావు, మైలవరం సిఐ రామచంద్రరావు, జి.కొండూరు ఎస్‌ఐ డి.రాజేష్, పోలీసు సిబ్బంది గట్టిగా బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ గొడవలు లేకుండా చేస్తూ గ్రామాల్లోని నాయకులకు సర్దిచెప్పి ప్రశాంత వాతావరణానికి కృషి చేస్తున్నారు.

కాపులకు ఉపాధి యూనిట్ల
ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ, ఏప్రిల్ 16: రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో స్వయం ఉపాధి యూనిట్లు నిర్వహించుకునేందుకు రుణాల కోసం తక్షణం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కోట్ల శివశంకరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని కాపు కులాల అభ్యర్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 21 నుండి 50 ఏళ్లలోపు వయస్కులై ఉండాలని, తెల్ల రేషన్‌కార్డు, ఆధార్, మీ సేవ ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపా రు. గతంలో నమోదు చేసుకుని రుణం పొందినవారు మళ్లీ దరఖాస్తు చేయనవరసం లేదన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు.

మంచినీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ: చైర్మన్ బాబా ప్రసాద్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 16: వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక వాటర్ వర్క్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మురుగు నీరు వస్తుండటం పట్ల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా పైప్‌లైన్‌లు లీకేజీ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరాను పర్యవేక్షిస్తూ పుర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఇ వెంకటరాజును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, ఎఇ వరప్రసాద్, టీడీపీ నాయకుడు కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు.