కృష్ణ

ఉపాధి పనుల్లో జిల్లా ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉపాధి హామీ పనుల్లో చేపట్టిన కార్యాచరణ వల్ల నాన్ ఎన్‌ఆర్‌ఈజీస్ (నరేగ)గా ఉన్న కృష్ణా జిల్లాను ఎన్‌ఆర్‌ఈజీఎస్ జిల్లాగా మార్చగలిగామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో 39శాతం వృద్ధి సాధించ డం ద్వారా చక్కటి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 79వేల మంది ఉపాధి కూ లీలు పని చేస్తున్నారని, లక్ష మంది కోసం పనులు చేపట్టేలా కృషి చే స్తున్నామన్నారు. జిల్లాలో 2018 -19 ఆర్థిక సంవత్సరానికి 19శాతం వృద్ధిరేటు లక్ష్య ంగా నిర్ణయించుకుని ఆ దిశగా పని చేస్తున్నామన్నా రు. ఖరీఫ్ సీజన్‌లో సేంద్రీయ ఎరువులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఉద్యానవనం, సెరీకల్చర్, పశుసంవర్ధక శాఖల్లో మంచి ప్రగతి సాధిస్తున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ స్టార్ రేటింగ్‌లో భాగంగా 8, 7, 6, 5 రేటింగ్‌లో ఉన్నాయన్నారు. 10 స్టార్ రేటింగ్ చేరుకునేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో రూ. 16కోట్ల రూపాయలతో అంగన్‌వాడీ కేం ద్రాలు, డిజిటల్ తరగతి గదులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ-2 పీ బాబూరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.