కృష్ణ

మిన్నంటిన హోథా నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో సంపూర్ణవంతంగా ముగిసింది. ప్రత్యేక హోదా నినాదం జిల్లా అంతటా ప్రతిధ్వనించింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఉద్యమకారులు తూర్పారబట్టారు. సాధన సమితి ఇచ్చిన పిలుపుకు టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చాయి. తెల్లవారు జాము నుండే ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి బంద్ చేయించారు. బంద్ కారణంగా జన జీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం వరకు ఏ ఒక్క బస్సును డిపోల నుండి బయటకు రాకుండా ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. వర్తక, వాణిజ్య దుకాణాలు తెరుచుకోలేదు. జాతీయ బ్యాంక్‌లతో సహా అన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు మూతబడటంతో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌లో కొద్దిమేర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా అంతటా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతబడగా కలెక్టరేట్‌లో మాత్రం ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరయ్యారు. ప్రతి సోమవారం నిర్వహించే మాదిరిగా ఈ సోమవారం కూడా జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖ అధికారులతో ‘మీకోసం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. ఇదే సమయంలో బంద్‌ను పర్యవేక్షిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘మీకోసం’ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. బంద్‌కు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే వీరి డిమాండ్‌ను ఏ మాత్రం పట్టించుకోని జెసీ విజయకృష్ణన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ మాజీ విప్, వైఎస్‌ఆర్ సీపీ పేర్ని వెంకట్రామయ్య (నాని) సమావేశ మందిరంలోకి వచ్చి బంద్‌కు సహకరించాలని కోరారు. అయినా అధికారులు సహకరించకపోవటంతో ఆగ్రహించిన ఆందోళనకారులు అక్కడే బైఠాయించి హోదా నినాదాలను హోరెత్తించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయటంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను బయటకు పంపించేశారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ కార్యాలయంలో బంద్ చేయిస్తున్న ఆందోళనకారులను బందరు డీఎస్పీ యండి మహబూబ్ బాషా నేతృత్వంలో టౌన్ సీఐ వాసవి, రూరల్ సీఐ రవికుమార్ తమ సిబ్బందితో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను ఇనగుదురు పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు స్టేషన్‌లో ఉంచిన తర్వాత వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఆందోళనలు జరిగాయి.