కృష్ణ

మీకో సగం... మాకో సగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ఇసుక సీనరేజీ నిధులపై మండలంలోని వల్లూరుపాలెం, తోట్లవల్లూరు గ్రామ పంచాయతీల వివాదం మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఇసుక సీనరేజీ నిధులపై గతంలో ఇరువురు పంచాయతీలు నిధులు అంటే మావని కోర్టుకు వెళ్ళారు. దీనివల్ల నిధులు ఆగిపోవటంతో రెండు పంచాయతీల గ్రామ పెద్దలు కూర్చుని మాట్లాడుకుని రూ.2.20 కోట్ల ఇసుక సీనరేజీ నిధులను చెరి సగం పంచుకుందామని కోర్టులో రాజీ పడ్డారు. దీంతో తోట్లవల్లూరు గ్రామ పంచాయతీకి రూ.1.10 కోట్లు, వల్లూరుపాలెం గ్రామ పంచాయతీకి రూ.1.10 కోట్లు నిధులు వచ్చాయి. దీంతో ఆయా గ్రామ పంచాయతీలు ఆ డబ్బులతో ఆ గ్రామ పంచాయతీల వారు పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు. అయితే యార్లగడ్డ శివయ్య తదితరులు మార్చిలో మళ్ళీ హైకోర్టులో కేసు వేశారు. 1971 బైపర్‌కేషన్ ఆర్డర్‌ను, 2012లో డిపిఓ ఇచ్చిన సమాచారాన్ని హైకోర్టుకు సమర్పించి ఆర్‌ఎస్‌నెం 445 తోట్లవల్లూరుకు టేటాయించాలని, అలాగే వల్లూరుపాలెం పంచాయతీకి ఇచ్చిన రూ.1.10 కోట్లను కూడా తోట్లవల్లూరు పంచాయతీకి ఇప్పించాలని పిటిషన్ వేశారు. శివయ్య, వైఎస్ ఎంపీపీ కోటేశ్వరరావు, లంకా శ్రీనివాసరావు, మహ్మద్ జహీర్, వీరంకి రమేష్, తోట సాయిబాబు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన హైకోర్టు రూ.2.20కోట్లను యధాతంగా ఉంచాలని స్టే మంజూరు చేసింది. ఏపీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరి, జిల్లా కలెక్టర్, జడ్పీ సీఈఓ, తహశీల్దార్, మైనింగ్ ఏడీ, తోట్లవల్లూరు, వల్లూరుపాలెం పంచాయతీల కార్యదర్శులను రెస్పాండ్ చేస్తు హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని శివయ్య మంగళవారం తెలిపారు.