కృష్ణ

హోదా కోసం మడమతిప్పని సైనికుడు పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, రావాలని అధికార టీడీపీ, బీజేపీలను ఎదురించి దేశం మొత్తాన్ని రాష్ట్రం వైపు చూపిస్తూ రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చి వేసిన ఏకైక జన సైనికుడు పవన్ కల్యాణ్ ఒక్కడేనని ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు, ప్యానెల్ స్పీకర్ పార్థసారథి స్పష్టం చేశారు. స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మంటపంలో మైలవరం నియోజకవర్గ జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ 2014 ఎన్నికలలో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటానికి పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేశారని, అభివృద్ధి చేస్తారని ఆశిస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ఆరోపించారు. సభలో పాల్గొన్న పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ పరిశీలకులు ముత్తంశెట్టి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలన్నారు. విజయవాడ పశ్ఛిమ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ నిబద్ధతతో జనం కోసం జనసేన పాటుపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సుగుణబాబు, లక్ష్మి, శశికళ, సౌజన్య, వర్మ, శ్రీకాంత్, వైఎన్నార్, కృష్ణరాయలు, మల్లి, అజయ్‌బాబు, కోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా
నేటి నుండి ‘మన బడి’

మచిలీపట్నం, ఏప్రిల్ 22: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు గాను ప్రతి యేడాది నిర్వహించే మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించనున్నారు. కార్యక్రమ నిర్వహణపై విద్యా శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేశారు. నేటి నుండి ప్రారంభం కానున్న మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ప్రారంభించే ఈ కార్యక్రమం 8 రోజులపాటు జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాలొంటారు. 24న అంగన్‌వాడీల ఆధ్వర్యంలో బడిబాటపై విస్తృత ప్రచారం చేయనున్నారు. 25న ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడతారు. 26న ఏడు, ఎనిమిది తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులను గుర్తించి వారిని ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో చేర్పించనున్నారు. 27న ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు గాను తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. 28న పాఠశాలకు రాకుండా బయట ఉన్న విద్యార్థులపై సర్వే నిర్వహిస్తారు. 29న మురికివాడల్లో నివశిస్తూ బడికి దూరమవుతున్న విద్యార్థులను గుర్తిస్తారు. చివరి రోజైన 30వ తేదీన మన బడి వివరాలను మండల స్థాయిలో పాఠశాలల వారీగా అప్‌లోడ్ చేస్తారు.