కృష్ణ

మొక్కజొన్న రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మొక్కజొన్న రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావు రైతులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన స్థానిక మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులతో మాట్లాడి వారి దిగుబడులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న రైతుకు క్వింటాకు 200 రూపాయల చొప్పున ధర నిర్ణయించటం జరిగిందని, రైతులు వారి దిగుబడులను బయటి మార్కెట్‌లో అమ్ముకున్నా అనుకున్న ధర రాని పక్షంలో వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రైతులు తాము అమ్ముకునే మొక్కజొన్న దిగుబడులను ఎవరికి అమ్ముకంటున్నదీ, ఎంతకు అమ్ముకుంటున్నదీ వివరంగా పత్రాలను తయారు చేయించుకోవాలన్నారు. ఒక్కొక్క రైతుకు 100 క్వింటాళ్ళ వరకూ వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించే దానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతులు దీనిని గమనించాలని కోరారు. ఈకార్యక్రమంలో వీఆర్వో రవీందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

డోకిపర్రుకు వౌలిక సదుపాయాలే లక్ష్యం

* సొంత నిధులతో నిర్మించిన వంతెన ప్రారంభం * మెయిల్ అధినేత పిపి రెడ్డి

గుడ్లవల్లేరు, ఏప్రిల్ 22: డోకిపర్రు ప్రజలకు వౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టెక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) అధినేత పీపీ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని డోకిపర్రులో ఎస్టీ కాలనీ వాసుల చిరకాలవాంఛ అయిన వంతెన ప్రారంభోత్సవాన్ని ఆదివారం అదే కాలనీకి చెందిన వృద్ధురాలితో నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల క్రితమే డోకిపర్రు గ్రామాన్ని పీపీ రెడ్డి దత్తత తీసుకున్న విషయం విధితమే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పీపీ రెడ్డి మాట్లాడుతూ ఎస్టీ కాలనీ వాసుల చిరకాల వాంఛ అయిన వంతెనను తన సొంత నిధులు రూ.30లక్షలతో నిర్మించినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. ప్రభుత్వ నిధులు వస్తాయని వేచి చూడకుండా తమ సొంత నిధులతోనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పురిటిపాటి వీరారెడ్డి, విజయలక్ష్మి దంపతులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వీరారెడ్డి కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు.