కృష్ణ

పండ్లను మాగబెట్టితే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 24: కాల్షియం కార్బైడ్ ఉపయోగించి కృత్రిమంగా పండ్లను మాగబెట్టి అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి మామిడి పండ్ల అమ్మకదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండ్లను మాగబెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వారిపై చట్ట రీత్యా చర్యలు ఉంటాయన్నారు. ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఆరు నెలల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జెసీ-2 పిడుగు బాబూరావు, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ ఇసుక కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు

మచిలీపట్నం, ఏప్రిల్ 24: కృత్రిమ ఇసుక కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇసుక లోడింగ్ రవాణాపై జిల్లా స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు భారం లేకుండా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల కన్నా అధికంగా వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక విధానంపై జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, మైన్స్ అధికారులు జిల్లా స్థాయిలో ఉచిత ఇసుక విధానం అమలుపై పర్యవేక్షణ చేస్తారన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, డీఎస్పీలు, మైన్స్ అధికారులు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్, పోలీస్, మైనింగ్, గ్రామ స్తాయిలో వీఆర్‌ఓ, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 17 ఇసుక రీచ్‌లతో పాటు కొత్తగా మరో రెండు రీచ్‌లను గుర్తించామన్నారు. రీచ్‌ల వద్ద ర్యాంప్ బాటల నిర్వహణకు రూ.100లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్‌ఓ అంబేద్కర్, ఎడీ మైన్స్ కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.