కృష్ణ

వారం రోజుల్లో నివేశన స్థలాలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: మండల కేంద్రం మొవ్వలోని రీ సర్వే నెం.284/1లోని 49 మంది లబ్ధిదారుల్లో గుర్తించిన అర్హులకు వారం రోజుల్లో నివేశన స్థలాలను ఆర్డీఓ ఉదయ భాస్కర్ ద్వారా పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని మొవ్వ తహశీల్దార్ రామానాయక్ హామీ ఇచ్చారు. మంగళవారం సీపీఐ పామర్రు నియోజకవర్గ కార్యదర్శి దగాని సంగీతరావు మండల కార్యదర్శి చెరకు శ్రీనివాసరావు, సీపీఎం పామర్రు నియోజకవర్గ కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు, మండల కార్యదర్శి శీలం ప్రకాశరావు, కూరపాటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో లబ్ధిదారులు నివేశన స్థలాల్లో ఎర్రజెండాలు పాతి స్వాధీనానికి ప్రయత్నించటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వీఆర్‌ఓ సమాచారం మేరకు తహశీల్దార్ బి రామానాయక్ హుటాహుటిన ఆ ప్రాంతానికి విచ్చేసి లబ్దిదారులు, రాజకీయ నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్, సీనియర్ అసిస్టెంట్ ఎ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీలను బలోపేతం చేయాలి
తోట్లవల్లూరు, ఏప్రిల్ 24: గ్రామ పంచాయతీలకు తగిన అధికారాలు, హక్కులను కల్పించాలని, జన్మభూమి లాంటి కమిటీలతో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చవద్దని ఎంపీపీ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. తోట్లవల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్పంచ్‌లుగా ఎంపికైన పెనమకూరు సర్పంచ్ సూరపనేని వెంకటేశ్వరరావు, వల్లూరుపాలెం సర్పంచ్ మాదల రంగారావు, పెనమకూరు, వల్లూరుపాలెం కార్యదర్శులు పద్మావతీదేవి, గంగాధరరావులను వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీఓ ఎస్‌ఈ పద్మసుధ ఘనంగా సన్మానించారు. అలాగే గరికపర్రు సర్పంచ్ నడకుదురు రాజేంద్ర, ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ పిఎస్ కోటేశ్వరరావులను ఎంపీడీఓ ఎస్‌ఈ పద్మసుధ సత్కరించారు. తోట్లవల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం వెలవెలబోయింది. సర్పంచ్‌లు, కార్యదర్శులు డుమ్మాకొట్టారు. 16 గ్రామాల సర్పంచ్‌లకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. అలాగే ఇద్దరు కార్యదర్శులు హాజరయ్యారు.