కృష్ణ

యేడాదిలో ఎన్నో విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రాచీన, చారిత్రక విశిష్ఠతను కలిగి ఉన్న కృష్ణాజిల్లాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి యేడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన యేడాదిలో జిల్లా అన్ని రంగాల్లో అంతులేని అభివృద్ధిని సాధించిందన్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించగా సేవా రంగంలో నా బూతో నా భవిష్యతి అన్న రీతిలో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మాధ్యమిక రంగం వైపు వడి వడిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రీతిలో వేగంగా, సులభంగా సేవలందించడమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నట్లు తెలిపారు. జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గాను తలసరి ఆదాయం రూ.2లక్షలకు చేరిందన్నారు. ప్రజల నుండి వచ్చే ఏ చిన్నపాటి సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే మీకోసం, మీసేవ, జన్మభూమి, సీఎం కనెక్టవిటీ, 1100 తదితర రూపాల్లో వస్తున్న సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తూ యేడాదిగా రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు తెలిపారు. పల్లెనిద్ర ద్వారా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టగా రానున్న రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. అర్జీదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల వారీగా ‘మీకోసం’ కార్యక్రమాలను నిర్వహించి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. అలాగే వారానికి ఒకసారి బస్సు యాత్ర ద్వారా జిల్లా అధికార యంత్రాంగం అంతా గ్రామాల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ‘గ్రామదర్శిని’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గాను ఈ-కలెక్టర్ మొబైల్ యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ఏడాది దాతల సహకారంతో నిర్వహించిన స్వీకారం కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలను దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రెండు మూడు నెలల్లో రూ.1.30కోట్లతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూన్ నెలలో సాంఖ్యీకరణ, స్వీకారం పండుగలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ముడ తొలి కానుకగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఏడు ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన పార్కులను అభివృద్ధిపరుస్తున్నట్లు తెలిపారు. జూన్‌లో బందరు ఓడరేవుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పోర్టు శంకుస్థాపనతో పాటు బందరు ఉత్సవం, బీచ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ అంబేద్కర్, ముడ వీసీ విల్సన్ బాబు, బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
కాగా, జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి యేడాది పూర్తి చేసుకున్న కలెక్టర్ లక్ష్మీకాంతంను మంగళవారం జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ కలెక్టర్‌ను సత్కరించారు. ఆ తర్వాత రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను గజమాలతో సత్కరించారు.