కృష్ణ

పట్టణాల్లో ఇక మరింత పచ్చదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్టవ్య్రాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రూ. 641 కోట్ల వ్యయంతో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి భారీ పథకాలు అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మొక్కలు నాటటం, చెట్ల పెంపకం, ఆకర్షణీయమైన వనాలు, పార్కులను రూపొందించడానికి రాష్ట్ర పట్టణ పచ్చదనం సుందరీకరణ సంస్థ (గ్రీనింగ్ కార్పొరేషన్) 741 రకాల డిజైన్లు రూపొందించి పనులను ప్రారంభించింది. పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే పచ్చదనం సుందరీకరణకు సంబంధించిన 200 కిలోమీటర్ల పనులు చేపట్టి ఇప్పటికి 172.92 కిలోమీటర్ల పనులను పూర్తిచేసింది. రాష్టవ్య్రాప్తంగా 12 ప్రధాన ఆస్పత్రుల్లో 726.11 ఎకరాల్లో మొక్కలు నాటడం, అందమైన పచ్చదనంతో కూడిన ప్రాంగణాలుగా రూపొందించడానికి 320 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన గ్రీన్ కార్పొరేషన్ 12వేలకు పైగా మొక్కలు నాటింది. ఆస్పత్రులతో పాటు విద్యాసంస్థలపై కూడా దృష్టి సారించింది. 11 విశ్వవిద్యాలయాల్లో పచ్చదనాన్ని ఒక పద్ధతి ప్రకారం పెంపొందించడానికి రూ. 13.38 కోట్ల విలువైన పనులకు సంబంధించి నివేదికను రూపొందించి త్వరలో దాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈమేరకు ఒక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద మూడు విశ్వవిద్యాలయాల్లో 1.26 కోట్ల రూపాయలతో 11వేలకు పైగా మొక్కలు నాటడం ద్వారా సుందరీకరణ చేయాలని పనులు ప్రారంభించింది. నన్నయ్య విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, ద్రవిడియన్ విశ్వవిద్యాలయంలో ప చ్చదనం అభివృద్ధి నమూనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి వెంబడి రూ. 29 కోట్లతో 50వేల మొక్కలను గ్రీనింగ్ కార్పొరేషన్ నాటిస్తోంది. ఇప్పటికే 9 కిలోమీటర్లలో 9200 మొక్కలు నాటారు. తిరుమల అలిపిరితో పాటు శ్రీశైలం, అన్నవరం, కనకదుర్గ గుడి వంటి ఏడు ప్రధాన ఆలయాల పరిసరాల్లో 63 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆకర్షణీయమైన హరిత వనాలు, మొక్కల పెంపకం వంటి చర్యలు పెద్దఎత్తున చేపడుతోంది. వివిధ వనాలు, పార్కులకు వచ్చే పౌరుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వాతావరణం కల్పిస్తోంది గ్రీనింగ్ కార్పొరేషన్. ఇందుకోసం మొదటిసారిగా 53 పట్టణాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 80 ఫిట్నెస్ పరికరాలను సమకూర్చి జిమ్‌లు ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. ఇం దుకు సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. అమృత్ పథకం కింద వివిధ పార్కుల్లో హరిత ప్రాంగణాలను ఏర్పాటుచేసి ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడేలా ఉండేలా అభివృద్ధి పనులను ప్రారంభించింది. 2015-20 వరకు 32 పట్టణ ప్రాంతాల్లో 85కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేస్తూ ఇప్పటివరకు 15 పార్కులను అభివృద్ధి చేశారు. ఇలా మొత్తం ఈ ఏడాది చివరకు 123 పార్కులను అభివృద్ధి చేయడానికి ముమ్మరంగా గ్రీనింగ్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. 2017-18 సంవత్సరంలో మొత్తం దాదాపు 17 లక్షల మొక్కలను నాటడం, చెట్లను పెంచడం ద్వారా బృహత్ ప్రణాళికను అమలు చేస్తున్నారు. చెట్లు, మొక్కలు కాపాడేందుకు ట్రీగార్డ్‌లను కూడా సబ్సిడీ ధరకు అందజేస్తున్నారు. గ్రీనింగ్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఫ్లైఓవర్ పనుల వల్ల ప్రభావం పడిన 272 చెట్లను స్థానభ్రంశం చేసి నాటడం ద్వారా పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. 40ఏళ్ల పైబడ్డ చెట్లను కూడా జాగ్రత్తగా 84 శాతం ఫలవంతమయ్యేలా స్థానభ్రంశం కల్పించగలిగారు.
ద్రోణ్‌ల సహకారంతో పచ్చదనం
ద్రోణ్‌ల సహాయంతో సర్వే చేసి పచ్చదనం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా తిరుపతి, విశాఖపట్నం, కాకినాడలో ఇప్పటికే ద్రోణ్ సర్వే చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద రాష్ట్రంలో 123 పార్కులను గ్రీనింగ్ కార్పొరేషన్ అభివృద్ధి చేయబోతోంది. సింగపూర్ నుంచి నిపుణులను రప్పించి ఇక పార్కుల అభివృద్ధికి అధికారులకు శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.