కృష్ణ

మురుగునీటి శుద్ధీకరణతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: డ్రైనేజీ నీటి శుద్ధి పంపింగ్ స్కీం ద్వారా పట్టణంలో నెలకొన్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమృత పథకం రెండవ విడతలో భాగంగా రూ.16కోట్ల 76లక్షల వ్యయంతో మురుగునీటి శుద్దీకరణ ఫ్లాంట్ నిర్మాణ పనులకు సోమవారం ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ బ్రిటీష్ వారి హయాంలో మూడు ప్రాంతాల్లో పంపింగ్ స్కీంలు ఉండేవన్నారు. వాటి ద్వారా మురుగునీటిని బయట పంపేవారన్నారు. సముద్రం కన్నా పట్టణ ప్రాంతం పల్లంగా ఉండటం వల్ల వర్షా కాలంలో మురుగునీటి సమస్య ఏర్పడుతోందన్నారు. ఈ సమస్యను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. పంపింగ్ స్కీంలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 500 హార్స్‌పవర్ మోటార్లను ఏర్పాటు చేసి మురుగునీటి సమస్య తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామన్నారు. రూ.22కోట్లతో చేపట్టిన డ్రైనేజీ అనుసంధాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి కూడా సుమారు రూ.76కోట్లతో అంతర్గత డ్రైన్ల నిర్మాణం కూడా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడు స్తంభాల సెంటర్ నుండి పెడన రోడ్డు వరకు నాలుగు రోడ్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.20కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వేసవిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా 1600 హార్ట్స్ పవర్ మోటార్లతో తరకటూరు మంచినీటి చెరువును నింపడం జరిగిందని మంత్రి రవీంద్ర తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మురుగునీరు శుద్ధి చేసే ఫ్లాంట్ ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అన్నారు. ఈ ఫ్లాంట్ ఏర్పాటు వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడదని, త్వరలో ఈ ప్రాంతంలో ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రూ.2.50కోట్లతో రక్షిత మంచినీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం డైరెక్టర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, కౌన్సిలర్లు పల్లపాటి సుబ్రహ్మణ్యం, ధనికొండ నాగమల్లేశ్వరి, కమిషనర్ పిజె సంపత్ కుమార్, ప్రజారోగ్య శాఖ డీఇ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.