కృష్ణ

వేసవిలోనే కాసిన సీతాఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: వేసవిలో మామిడి, వర్షాకాలంలో సీతాఫలాలు కాయడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఈ ఏడాది ఆలస్యంగా మామిడికాయ లు కాయడం, సీతాఫలాలు మాత్రం వేసవిలోనే రావడం రెండూ ఏకకాలంలో జరిగిన అరుదైన సంఘటన పట్టణంలోని శ్రీరాంపురంలో ఉన్న పండ్ల వ్యాపారి వడ్డాది రాజేష్ ఇంట్లో చోటు చేసుకుంది. గత నెల రోజుల కిందటే సీతాఫలం చెట్టుకు పిందెలు రావడం మొదలయ్యాయి. సోమవారం రెండు కాయలు ప ం డాయి. మరికొన్ని కాయలు కళ్ళు విప్పి పండే దశకు చేరాయి. ఇటువంటి అరుదైన సందర్భం పదేళ్ళకోసారి ఎక్కడో ఒకచోట జరుగుతుంటుందని పండ్ల వ్యాపారి రాజేష్ చెప్పారు.

28 నుంచి ‘జ్ఞానధార’
* పక్షం రోజులు నిర్వహణ * కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి
విజయవాడ, మే 21: విద్యలో వెనుకబడిన విద్యార్థులకు కనీస సామర్థ్యాలు పెంపొందించే ఉద్దేశంతో ఈ నెల 28 నుండి ‘జ్ఞానధార’ కార్యక్రమం 22 ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు జ్ఞానధార గురించి వివరించారు. 15రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం పూర్తిగా రెసిడెన్షియల్ కార్యక్రమని, రేపటి నుండి వివిధ అంశాలతో కూడిన ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 28న జ్ఞానధార కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 22న ఎంఈఓల ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్టుల ఆధారంగా డీఈఓలు కన్సాలిడేటెడ్ రిపోర్టులను సమర్పిస్తామన్నారు. 23న వేదికలను నిర్థారించి వాటికి ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తారన్నారు. 24న కలెక్టర్ ఆధ్వర్యంలో భాగస్వామ్య శాఖలైన (సర్వశిక్ష అభియాన్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్, పోలీస్, సీఈఓ, జిల్లా పరిషత్, మెడికల్ అండ్ హెల్త్ మున్సిపల్) వారికి ఓరియంటేషన్ నిర్వహిస్తారన్నారు. 25న జిల్లా స్థాయిలో బ్రోచర్లు ఇంకా ఉపాధ్యాయులకు కావాల్సిన మెటీరియల్‌ను ముద్రించి సరఫరా చేస్తారని డివిజన్ నుండి జిల్లా పాయింట్ వరకు జ్ఞానధార మెటీరియల్‌ను పంపిణీ చేస్తారన్నారు. 26న వెన్యూ కో-ఆర్డినేటర్లను నియమించి 26, 27న గ్రామ స్థాయిలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన నిర్వహిస్తారన్నారు. సంబంధిత వేదికలకు విద్యార్థులను అనుసంధానించడం, ‘ఇ’ హాజరుకు కావాల్సిన సామగ్రి సమకూర్చడం, వేదికల వద్ద డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తారన్నారు. 28న అన్ని వేదికల్లో జ్ఞానధార స్థానికంగా ఉండే అతిథుల భాగస్వామ్యంతో ప్రారంభిస్తారన్నారు. 29న అన్ని వేదికల వద్ద బేస్ లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు.

వదంతులను నమ్మకండి: జిల్లా ఎస్పీ త్రిపాఠి

మచిలీపట్నం, మే 21: గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న వదంతులను నమ్మవద్దని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం ఒక ప్రకటన లో జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. పార్ధీ గ్యాంగ్, పిల్లలను ఎత్తుకుపోయే వారు, ఇతర ప్రాంతాల నుండి కొన్ని ముఠాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. జిల్లాలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు లేవన్నారు. ప్రజలు కూడా ఆ ందోళనకు గురి కావల్సిన అవసరం లే దన్నారు. సామాజిక మాధ్యమాల ద్వా రా వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్‌లకు గానీ, 100 డయల్ చేసి గానీ సమాచారం ఇవ్వాలని కో రారు. నిరాధారమైన మెసేజ్‌లను షేర్ చేయడం వల్ల ప్రజల్లో కొంత ఆందోళన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజలు కూడా ఇటువంటి చర్యలను ప్రోత్సహించడం సరికాదన్నారు. నిరాధారమైన మెసేజ్‌లను ఎవరికీ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమాచార సాంకేతిక చట్టం 2000తో పాటు సెక్షన్ 507 ఐపిసి ప్రకారం ఏదైనా స్వీకరించిన సమాచారాన్ని భయపెట్టి, అధీకృతంగా నిర్ధారించబడని సమాచారాన్ని ఇతరులకు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసినా పోస్టు చేసినా వారికి చట్ట ప్రకారం మూడు సంవత్సరాల జైలు, జరిమానా విధించడం జరుగుతుందన్నారు. సె క్షన్ 504 ఐపీసీ ప్రకారం రెండు సంవత్సరాలు జైలు, జరిమానా విధించ వచ్చని ఎస్పీ త్రిపాఠి తెలిపారు. మరికొన్ని చట్టాల కింద కూడా శిక్షార్హులవుతారన్నారు.